Vijay Devarakonda Family Star : ఫ్యామిలీ సినిమా అన్ని గంటలు చూస్తారా.. ఫ్యామిలీ స్టార్ రన్ టైమ్ షాక్..!
Vijay Devarakonda Family Star విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.
- By Ramesh Published Date - 10:29 AM, Sat - 30 March 24

Vijay Devarakonda Family Star విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సినిమా ట్రైలర్ బాగానే అనిపించింది. అయితే పరశురాం మళ్లీ గీతా గోవిందం తరహాలోనే ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా రన్ టైం కూడా ఎక్కువగా ఉండబోతుందని టాక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ స్టార్ సినిమా 2 గంటల 40 నిమిషాలు అంటే 160 నిమిషాల దాకా ఉంటుందని చెబుతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే కానీ సినిమా ఫైనల్ రన్ ఎంత అన్నది తెలుస్తుంది. అయితే ఫ్యామిలీ సినిమా అని చెప్పి 2 గంటల 40 నిమిషాల రన్ టైం అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.
అయితే ఆడియన్స్ సినిమాలో పాత్రలకు కనెక్ట్ అవుతారన్న నమ్మకంతోనే ఇలా రన్ టైం పెట్టినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ రన్ టైం కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ రన్ టైం తో విజయ్ సినిమా సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
Also Read : Nitin Tammudu First Look : లారీ ఎక్కిన నితిన్.. తమ్ముడు ఫస్ట్ లుక్ చూశారా..?