Nitin Tammudu First Look : లారీ ఎక్కిన నితిన్.. తమ్ముడు ఫస్ట్ లుక్ చూశారా..?
Nitin Tammudu First Look లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తో వచ్చి ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు.
- Author : Ramesh
Date : 30-03-2024 - 10:19 IST
Published By : Hashtagu Telugu Desk
Nitin Tammudu First Look లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తో వచ్చి ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ వెంకీతో భీష్మ తో హిట్ అందుకున్న నితిన్ ఈసారి రాబిన్ హుడ్ అంటూ మరో కొత్త కథతో వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా దిల్ రాజు బ్యానర్ లో కూడా మరో సినిమా చేస్తున్నాడు నితిన్.
వేణు శ్రీరాం డైరెక్షన్ లో నితిన్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ లాక్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు నితిన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నితిన్ లారీ ఎక్కి ఉండగా లేడీ ఎవరో ఆ లారీని డ్రైవింగ్ చేస్తున్నట్టుగా ఉంది. తమ్ముడు టైటిల్ లానే సినిమా కూడా ఎమోషనల్ కంటెంట్ తో పాటుగా యాక్షన్ కూడా ఉండేలా ఉంది.
దిల్ రాజు ఆస్థాన దర్శకుడైన వేణు శ్రీరాం సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆయన వకీల్ సాబ్ తర్వాత చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. నితిన్ రాబిన్ హుడ్ తమ్ముడు రెండు సినిమాలతో అదరగొట్టబోతున్నాడని చెప్పొచ్చు.