Varun Tej : ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందే.. లావణ్యతో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా వరుణ్ - లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకున్నారు.
- By News Desk Published Date - 08:14 AM, Sun - 3 November 24

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్యతో ఆరేళ్ళు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపి గత సంవత్సరం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ – లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్పెషల్ పెళ్లి ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే వరుణ లావణ్య పెళ్లి తర్వాత వరుణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా మట్కా.
1970-80 బ్యాక్ డ్రాప్ లో మట్కా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వాసు క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ అదరగొట్టాడని తెలుస్తుంది. తాజాగా మట్కా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్లో మట్కా సినిమాలో వరుణ్ తేజ్ కి భార్య పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి పాత్ర గురించి ప్రశ్నించారు.
దీనికి వరుణ్ తేజ్ సమాధానమిస్తూ.. ప్రతి సక్సెస్ ఫుల్ అబ్బాయి జీవితంలో ఒక అమ్మాయి ఉంటుంది. ఈ సినిమాలో వాసు క్యారెక్టర్ ని భయపెట్టేది కూడా కేవలం తన భార్య పాత్రే. అతను దారి తప్పుతున్నాడు అంటే సరిచేసేది భార్య పాత్రే. వాడు ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందే అని అన్నాడు. దీనికి మరి లావణ్య మాట మీరు వింటున్నారా అని అడగ్గా.. లేడీస్ కూడా ఆలోచించి అడిగితే మేము కూడా ఆలోచించి ఓకే చెప్తాము. లావణ్య గారు ఆలోచించి అడుగుతారు ఏదైనా కాబట్టి నేను కూడా ఆలోచించి ఓకే చెప్తాను అని అన్నారు. పెళ్లయిన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత వరుణ్ ఇలా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Gangavva : ఆరోగ్య సమస్యలతో గంగవ్వ కూడా బిగ్ బాస్ నుంచి బయటకు.. నేనే వెళ్ళిపోతాను అంటూ కామెంట్స్..