Gangavva : ఆరోగ్య సమస్యలతో గంగవ్వ కూడా బిగ్ బాస్ నుంచి బయటకు.. నేనే వెళ్ళిపోతాను అంటూ కామెంట్స్..
ఈ సీజన్ లో ఇప్పటికే నాగ మణికంఠ ఆరోగ్య సమస్యలతో తనంతట తానే ఎలిమినేట్ అయి వెళ్ళిపోయాడు.
- By News Desk Published Date - 07:56 AM, Sun - 3 November 24

Gangavva : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నేటితో 9 వారాలు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే 9 మంది ఎలిమినేట్ అవ్వగా నేడు నయని పావని ఎలిమినేట్ అయిందని సమాచారం. ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో తమంతట తామే బయటకు వెళ్లిపోతుంటారు. ఈ సీజన్ లో ఇప్పటికే నాగ మణికంఠ ఆరోగ్య సమస్యలతో తనంతట తానే ఎలిమినేట్ అయి వెళ్ళిపోయాడు.
ఇటీవల అవినాష్ కూడా ఆరోగ్య సమస్యలతో వెళ్ళిపోతాడు అనుకున్నారు కానీ డాక్టర్ చెకప్ తర్వాత హౌస్ లోనే ఉండిపోయాడు. అయితే తాజాగా గంగవ్వ ఆరోగ్య సమస్యలతో ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. నిన్న శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎప్పట్లాగే అందరి కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో గంగవ్వతో మాట్లాడుతూ గేమ్ లో ఇంకాస్త యాక్టివ్ గా ఉండాలి అని అన్నాడు నాగార్జున.
దానికి గంగవ్వ సమాధానమిస్తూ.. నాకు ఒళ్లునొప్పులు వస్తున్నాయి. నా వల్ల కాని రోజు నేనే హౌస్ నుంచి స్వయంగా వెళ్ళిపోతాను అని తెలిపింది. దీంతో త్వరలోనే గంగవ్వ కూడా ఆరోగ్య సమస్యలతో హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. గతంలో కూడా గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నప్పుడు అప్పుడు కూడా ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే బయటకు వెళ్ళిపోయింది.
Also Read : Kiran Abbavaram : పెళ్లి చేసుకోండి.. సక్సెస్ వస్తుంది.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..