Varalakshmi Sarathkumar: అనాధ పిల్లలతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. నెట్టింట ఫోటోస్ వైరల్!
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా తన భర్తతో కలిసి కొంతమంది అనాధ పిల్లలతో కలిసి తన భర్తడే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
- By Anshu Published Date - 11:45 AM, Wed - 5 March 25

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో చాలా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. మొదటి తమ్మెద సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసిన ఈమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా హీరోయిన్గా బిజీ అవ్వాలని చూస్తున్నా ఈమెకు ఎక్కువ శాతం నెగిటివ్ క్యారెక్టర్లే వస్తున్నాయి.
కాగా తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్ లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో భారీగా గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాలి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం తెలుగులో తమిళంలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.
ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో ఫుల్ జోష్ గా కనిపిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇకపోతే ఆమె నికోలాయ్ సచ్ దేవ్‌ను అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది వరలక్ష్మీ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వరలక్ష్మీ తన పుట్టిన రోజును అనాధ పిల్లలతో కలిసి జరుపుకుంది. తన భర్త నికోలాయ్ సచ్ దేవ్ తో కలిసి వరలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకుంది. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంచక్కా పిల్లల మధ్యలో కూర్చొని వారితో పాటు తింటూ తన బర్త్డే వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా గ్రేట్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.