HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ustaad Bhagat Singh Collections Drop Sharply On Day 2

Ustaad Bhagat Singh: 2వ రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 21-03-2026 - 2:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ustaad Bhagat Singh Collection
Ustaad Bhagat Singh Collection

Ustaad Bhagat Singh Collections పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బంది పడుతోంది. ఉగాది నాడు ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం, రెండో రోజు వసూళ్లలో భారీ డ్రాప్‌ను చూసింది. తొలి రోజు రూ.34.75 కోట్ల నెట్ వసూలు చేయగా, రెండో రోజు కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే సుమారు రూ.140 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అయితే, శనివారం నుంచి ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ విడుదలవుతుండటంతో ‘ఉస్తాద్’ కలెక్షన్లపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో ‘ఉస్తాద్’ మేనియా కనిపిస్తున్నప్పటికీ, సామాన్య ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తొలిరోజు బాక్సాఫీస్ వద్ద గర్జించిన ఈ చిత్రం రెండో రోజు ఊహించని విధంగా డ్రాప్ అయింది. సాక్నిల్క్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం మొదటి రోజు ఇండియాలో రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజు కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.59 కోట్ల గ్రాస్ (ఇండియా నెట్ రూ.44 కోట్లు) వసూలు చేసింది. వర్కింగ్ డే కావటం, మిక్స్‌డ్ టాక్ రావటం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ హిందీ వెర్షన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.137 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. నైజాంలో రూ.50 కోట్లు, ఆంధ్రాలో రూ.54 కోట్లుగా లెక్కలు ఉన్నాయి. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం రూ.140 కోట్ల షేర్ (సుమారు రూ.225 కోట్ల గ్రాస్) వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

‘ధురంధర్ 2’ దెబ్బ

ఇప్పటికే హిందీ వెర్షన్‌తో ‘ఉస్తాద్’ వసూళ్లకు గండికొట్టిన ‘ధురంధర్ 2’, శనివారం నుంచి తెలుగు వెర్షన్‌లో కూడా గ్రాండ్‌గా విడుదలవుతోంది. దీనికి తోడు అల్లు అర్జున్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఆ సినిమాను ప్రశంసించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ పరిణామం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వీకెండ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకుంటేనే ఈ చిత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • collections
  • Director Harish Shankar
  • pawan kalyan Ustaad Bhagat Singh
  • Rashikhanna
  • Rashikhanna Ustaad Bhagat Singh
  • sreeleela
  • Telugu Cinema
  • tollywood
  • Ustaad Bhagat Singh
  • Ustaad Bhagat Singh collections
  • Ustaad Bhagat Singh movie

Related News

Pawan Kalyan's comments on the 'Cockroach Party'

Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన అంశం.. కాక్రోచ్ జనతా పార్టీ. అవినీతి, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ సోషల్ మీడియాలో యువత ద్వారా పుట్టుకొచ్చిన ఉద్యమం ఇది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీ

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd