Trivikram Allu Arjun : 3 ఏళ్లు.. రెండు భాగాలు.. ప్లాన్ అదిరింది గురూజీ..!
Trivikram Allu Arjun అల్లు అర్జున్ తో త్రివిక్రం చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా చేస్తున్నారని తెలుస్తుంది. గురూజీ ప్లాన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఇంకా బడ్జెట్ డీటైల్స్
- By Ramesh Published Date - 11:45 PM, Wed - 1 January 25

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun,) త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ సినిమాను ఇదివరకు ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూడని ఒక భారీ కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద పురాణ ఇతిహాసాల కథలు బాగా వస్తున్నాయి. వాటిని మించిన కాన్సెప్ట్ ఏంటన్నది సస్పెన్స్ వీడట్లేదు.
త్రివిక్రం మాత్రం ఈ సినిమాను ఒక రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నాడు. పుష్ప 2 ( Pushpa 2) తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాగా నెక్స్ట్ సినిమాతో మళ్లీ నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయాల్సి ఉందట. అంతేకాదు త్రివిక్రం (Trivikram) ఈసారి ఈ సినిమాను 3 ఏళ్లు టైం తీసుకుంటున్నాడట.
అల్లు అర్జున్ తో త్రివిక్రం చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా చేస్తున్నారని తెలుస్తుంది. గురూజీ ప్లాన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఇంకా బడ్జెట్ డీటైల్స్ త్వరలో వెల్లడించే ఛాన్స్ ఉంది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రం అల్లు అర్జున్ సినిమా కోసమే పనిచేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో మొదలు కాబోతున్న ఈ సినిమా గురించి సెటప్ అంతా వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.