NTR- Prashanth Neel Movie : ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్లు?
NTR-Prashanth Neel Movie : ఈ మూవీలో మలయాళ స్టార్ నటులు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం
- By Sudheer Published Date - 11:59 AM, Mon - 6 January 25

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (NTR- Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans)తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో మలయాళ స్టార్ నటులు టొవినో థామస్, బిజూ మీనన్ (Tovino Thomas, Biju Menon ) కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఈ వార్తలతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. టొవినో థామస్ మరియు బిజూ మీనన్ వంటి మలయాళ స్టార్ నటుల సహకారంతో ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఉండేలా చేస్తారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రుక్మిణీ వసంత్ గతంలో కన్నడ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త లుక్లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ తన ఫిజిక్, లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామా కావడంతో అతడి లుక్, పాత్ర డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : CNG Govt : ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది ..? – కేటీఆర్