HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Questions To Congress Govt

CNG Govt : ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది ..? – కేటీఆర్

KTR Questions : ఒకే ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బును ఎటు ఉపయోగించిందో చెప్పాలని ప్రశ్నించారు

  • Author : Sudheer Date : 06-01-2025 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR revanth
KTR revanth

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Govt)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకే ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బును ఎటు ఉపయోగించిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు వాగ్దానాలు చేసిన ‘ఆరు గ్యారంటీలలో’ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆర్థిక పరిపాలనలో విఫలమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. “రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2,500, తులం బంగారం, పింఛన్ల పెంపు వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అలాంటప్పుడు ఆ అప్పు ఎందుకు చేశారు? ఆ డబ్బంతా ఎటు పోయిందో చెప్పగలరా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలతో కాంగ్రెస్ నేతలను నిలదీశారు.

“బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. గత పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసినా ప్రతి రూపాయిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడమే తప్ప, అభివృద్ధికి దారితప్పింది” అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో రాష్ట్రం ముందంజలో ఉందని ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తన పరిపాలనలో కనీస అవగాహన లేకుండా ముందుకెళ్తోంది” అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాటిని నమ్మబోరని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also : 4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • congress govt borrowing money
  • ktr
  • KTR questions

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd