K Vasu : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కన్నుమూత..
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) మరణించగా తాజాగా మరొకరు కన్నుమూశారు.
- By News Desk Published Date - 09:00 PM, Fri - 26 May 23

ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) మరణించగా తాజాగా మరొకరు కన్నుమూశారు. ప్రముఖ డైరెక్టర్ K వాసు(K Vasu) నేడు సాయంత్రం హైదరాబాద్(Hyderabad) ఫిలింనగర్ లోని తన నివాసంలోనే కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు సాయంత్రం కన్నుమూశారు.
దర్శకుడు K వాసు మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. వాసు తెలుగు, తమిళ్ లో దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలు చేశారు. చిరంజీవితో ప్రాణం ఖరీదు, కోతల రాయుడు, అల్లుల్లోస్తున్నారు అనే హిట్ సినిమాలు తీశారు. ఒకప్పటి సూపర్ హిట్ భక్తిరస చిత్రం శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం సినిమా కూడా ఈయనే తీసిందే. ఆరని మంటలు, ఇంట్లో శ్రీమతి-వీధిలో కుమారి.. లాంటి మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు కె.వాసు.
ఆయన మరణంతో సినీ పరిశ్రమలోని పలు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : Bandla Ganesh: గురూజీని కలవండి, భారీ గిఫ్ట్ ను అందుకోండి, త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ పంచులు