Tollywood Actors and Food: మన టాలీవుడ్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?
ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన ఫుడ్ అనేది ఉంటుంది. అన్ని రకాల ఫుడ్ లలో కొన్ని ఫుడ్స్ అంటే ప్రత్యేకంగా ఇష్టపడి తింటూ ఉంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు కూడా కొన్ని రకాల ఫుడ్లను అమితంగా ఇష్టపడి తింటారట.
- By Anshu Published Date - 09:30 AM, Fri - 2 September 22

ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన ఫుడ్ అనేది ఉంటుంది. అన్ని రకాల ఫుడ్ లలో కొన్ని ఫుడ్స్ అంటే ప్రత్యేకంగా ఇష్టపడి తింటూ ఉంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు కూడా కొన్ని రకాల ఫుడ్లను అమితంగా ఇష్టపడి తింటారట. మరి ఏ హీరోకి ఏ ఏ ఫుడ్ అంటే ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టాలీవుడ్ హీరో రానా కు తన అమ్మమ్మ చేసే సాంబార్ అంటే ఎంతో ఇష్టమట. అలాగే హైదరాబాద్ బిర్యానీ, హలీం కూడా రానా ఫేవరెట్ ఫుడ్స్.
నందమూరి నరసింహ హీరో బాలకృష్ణకు రొయ్యల కూర అంటే చాలా ఇష్టమట. దీంతో పాటుగా చికెన్ కర్రీ,చేపల పులుసును కూడా బాలయ్య అమితంగా ఇష్టపడి తింటూ ఉంటారట. అలాగే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇంట్లో చేసిన చేపల పులుసు అలాగే బిర్యానీ అంటే ఎంతో ఇష్టమట. డార్లింగ్ ప్రభాస్ కి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రభాస్ లంచ్ లో నాన్ వెజ్ తో పాటుగా చేపలు,రొయ్యలు కూడా ఉండాల్సిందే. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ట్రెడిషనల్ బిర్యాని తో పాటుగా అమ్మ చేతి వంటలని కూడా ఇష్టమేనట.
జూనియర్ ఎన్టీఆర్ కు నాటుకోడి పులుసు హైదరాబాద్ బిర్యాని అంటే ఎంతో ఇష్టమట. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వెజ్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారట. వీటిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు పప్పు, అరటికాయ ఫ్రై అంటే చాలా ఇష్టమట. అలాగే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు తన నానమ్మ చేసిన వంటలంటే ఎంతో ఇష్టమట. అందులో బిర్యానీ అంటే రామ్ చరణ్ కు ఇంకా ఎక్కువ ఇష్టమట.