Samantha: ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా తాను నటించిన సినిమాల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సమంత చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- By Anshu Published Date - 12:00 PM, Wed - 5 March 25

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు కెరీయర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. 2010 సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సమంత దాదాపు 15 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో ఫుల్ జోష్ గా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే కొంతకాలంగా ఈమె మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఈ సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటుంది సమంత. అందులో భాగంగానే చివరిగా ఖుషి మూవీ తో ప్రేక్షకులను పలకరించింది సామ్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత పూర్తిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ఆమె నటించిన సినిమాల విషయాల గురించి స్పందిస్తూ ఒక సినిమాలో నటించకుండా ఉండాల్సింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా ఈ సందర్భంగా హీరోయిన్ సమంత మాట్లాడుతూ.. సినిమాల్లో కొన్ని పాత్రలు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను.
అయితే ఇప్పుడు నేను ఆ సినిమాలు చూస్తున్నప్పుడు, నా పాత్రలు నాకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు అని సమంత తెలిపింది. కాగా సమంత మొదట ఏం మాయ చేసావే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగచైతన్య ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏ మాయ చేశావేకు ముందు ఒక తమిళ చిత్రంలో నటించింది సామ్. అందులో గ్లామర్ ఒలకబోసింది. బహుశా ఇప్పుడు ఆ సినిమా గురించేనేమో సామ్ ఇప్పుడు ఫీలవుతున్న తెలుస్తోంది.. కాగా సమంత ప్రస్తుతం రక్తబ్రహ్మండ: ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.