HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Actress Kajal Aggarwal Shares Her Latest Photos

Kajal Aggarwal: పెళ్లి అయినా ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న కాజల్.. ఫోటోస్ వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2024 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 17 Feb 2024 10 02 Am 1757
Mixcollage 17 Feb 2024 10 02 Am 1757

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. కళ్యాణ్ రామ్ హీరోగా 2007లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2009లో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ దెబ్బకు కాజల్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చి పడింది. దాంతో ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది.

ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించింది. ఈ సినిమా తో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది కాజల్ అగర్వాల్. ఇకపోతే కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి 2022 ఏప్రిల్ 19న మ‌గ‌బిడ్డ జన్మించాడు. ఆ సమయంలో సినిమాకు బ్రేక్ ఇచ్చింది కాజల్.

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన కాజల్ ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కాజల్ పెళ్లి అయ్యి బాబు ఉన్నప్పటికి ఆమె అందం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు తాజాగా కాజల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి అయినప్పటికి కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. వయసుతో సంబంధం లేకుండా తన అందరిని మరింత పెంచుకుంటూ ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kajal aggarwal
  • Latest photos
  • social media
  • tollywood

Related News

Kajal Aggarwal in Balayya's movie... First look poster.

Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. Every storm has a reason 🔥 Team #NBK111 is delighted to present and wishes

  • As for Samantha, the gem of our family, she is doing...

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

  • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

  • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd