Tillu Square Theatrical Business : టిల్లు స్క్వేర్ బిజినెస్.. మైండ్ బ్లాక్ చేస్తున్న సిద్ధు.. టైర్ 2 హీరోగా ప్రమోట్..!
Tillu Square Theatrical Business అంతకుముందు వరకు చిన్న చితకా వేషాలు వేస్తూ వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ గుంటూర్ టాకీస్ లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో సక్సెస్
- Author : Ramesh
Date : 20-02-2024 - 1:41 IST
Published By : Hashtagu Telugu Desk
Tillu Square Theatrical Business అంతకుముందు వరకు చిన్న చితకా వేషాలు వేస్తూ వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ గుంటూర్ టాకీస్ లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో అతను సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. టిల్లు స్క్వేర్ అంటూ త్వరలో డీజే టిల్లు సీక్వెల్ సినిమాతో వస్తున్నాడు సిద్ధు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తెచ్చింది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సూపర్ హిట్ కొట్టడంతో ఆ సినిమా సీక్వెల్ మీద భారీ హైప్ ఏర్పడింది. ఇక మార్చి 29న రిలీజ్ అవుతున్న టిల్లు స్క్వేర్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగినట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 35 కోట్ల దాకా టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు టాక్. టైర్ 2 హీరోల రేంజ్ కి ఈక్వల్ గా సిద్ధు సినిమా బిజినెస్ జరిగింది.
ఓ విధంగా చెప్పాలంటే టైర్ 2 హీరోల సినిమాలు కూడా కొన్ని పాతిక కోట్లకు అటు ఇటుగానే బిజినెస్ చేస్తాయి. కానీ టిల్లు స్క్వేర్ దానికి మరో 10 కోట్లు అదందంగా బిజినెస్ చేసింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం భారీ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా సితార బ్యానర్ సూపర్ ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.