Samantha: ఈ రెండేళ్లు నరకం.. సమంత మరోసారి షాకింగ్ కామెంట్స్!
చైతు-సామ్ ప్రేమ, పెళ్లి, విడిపోవటం అంతా ఒక మాయలా జరిగింది. ఎవరూ కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు. కానీ జరిగిపోయింది
- By Nakshatra Published Date - 11:17 PM, Sun - 9 April 23
Samantha: చైతు-సామ్ ప్రేమ, పెళ్లి, విడిపోవటం అంతా ఒక మాయలా జరిగింది. ఎవరూ కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు. కానీ జరిగిపోయింది. ఇప్పుడు నాగ చైతన్య తన వర్క్ లో బిజీగా ఉన్నారు. ఆయన ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కనిపించినా పెద్దగా బాధలో ఏమీ కనిపించరు. సమంత మాత్రం ప్రేమలో విఫమైన విషయాన్ని మాత్రం ఏదో విధంగా చెబుతూ బాధపడూతూనే ఉంటుంది తాజాగా కూడా ఆమె షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.
స్టార్ నటి సమంత.. చిన్న స్థాయి నుంచి వచ్చి స్టార్ నటిగా ఎదిగింంది. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ ఈమెకు లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సినిమాపై ఎంతో ప్రేమ, వర్క్ పై డెడికేషన్ చూపిస్తుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర అయినా ఆమెకు ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా, విడాకులు అనే అంశమే ఎంతో బాధ పెట్టింది. తాజాగా కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా బాధపడింది.
జీవితంలో ఎదురయ్యే వైఫల్య లు గొప్ప పాఠాలను నేర్పుతాయని సమంత అంది. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం శాకుం తలం. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా అభిమానులతో సామ్ ముచ్చటించారు.విజయాలకన్నా అపజయాలు, వైఫల్యాలు గొప్ప పాఠాలు నేర్పుతాయన్నా రు.అపజయాలు ఎదురైనప్పుడే మరింత ఉత్తమంగా మారడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. అస్సలు ఊహించని పరిణామాలు, జీవిత పాఠాలు ఎదురయ్యాయి. ఇప్పుడు దేనికైనా సిద్ధపడి ఉన్నానని అనుకుంటున్నాని చెప్పుకొచ్చారు.
Tags
Related News
Samantha : అతనికి బర్త్ డే విష్ చేసి ఐలవ్యూ చెప్పిన సమంత..!
Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకో మీడియాకు ఆమె మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది.