HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Peddi Special Song Is Out

Ram Charan: ‘పెద్ది’ స్పెషల్‌ సాంగ్‌ వచ్చేసింది..

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 2:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The ‘Peddi’ special song is out!
The ‘Peddi’ special song is out!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్యంతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రబృందం, తాజాగా అభిమానులకు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం ‘హెల్లల్లల్లో’కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో రామ్ చరణ్, శృతి హాసన్ తమ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు.

భోపాల్ వేదికగా రేపు భారీ స్థాయిలో సంగీత వేడుక నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రోమోను విడుదల చేయడం విశేషం. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చారు. రెహమాన్ సంగీతం అనగానే ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. దానికి తోడు ఇది స్పెషల్ సాంగ్ కావడంతో ఈ పాటపై ఆసక్తి రెట్టింపు అయింది. రేపు ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ పాటపై మరో ఆసక్తికరమైన చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇందులో మరో కథానాయిక కూడా కనిపించనున్నారని, ఆమె ఎవరనే విషయాన్ని చిత్రబృందం రహస్యంగా ఉంచిందని ప్రచారం సాగుతోంది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. రేపు జరగనున్న సంగీత వేడుకలో ఈ పాటను అధికారికంగా విడుదల చేయనున్నారు.

వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే భారీ హైప్ ఉన్న ఈ చిత్రానికి, ఈ స్పెషల్ సాంగ్ మరింత ఊపును తెచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Ram Charan
  • Ananta Sriram
  • ar rahman
  • Buchi Babu Sana Film
  • Mythri Movie Makers
  • Peddi Movie
  • Peddi Movie Update
  • Shruti Hassan
  • special song

Related News

Ram Charan's *Peddi* trailer is out!

Peddi Trailer: రామ్ చరణ్ పెద్ది ట్రైలర్‌ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం 4.05 గంటలకు ముంబయి వేదికగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో మెగా జాతర ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్‌చరణ్ మేకో

    Latest News

    • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

    • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

    • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    • Ram Charan: ‘పెద్ది’ స్పెషల్‌ సాంగ్‌ వచ్చేసింది..

    • Cockroach Party: బొద్దింకల పార్టీ.. పాక్‌లో కాక్రోచ్‌ అవామీ పార్టీల ఆవిర్భావం

    Trending News

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd