Murari Movie Re Release : ‘మురారి’ ప్రదర్శిస్తున్న థియేటర్ లోనే పెళ్లి చేసుకున్న జంట
మురారి సినిమా చూస్తూ ఒక జంట ఏకంగా పెళ్లి చేసుకున్న వీడియో మరో ఎత్తుగా నిలిచింది. ఓ యువకుడు మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు పాట వస్తున్న సమయంలో యువతి మెడలో పసుపు తాడు కట్టాడు.
- Author : Sudheer
Date : 09-08-2024 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. గత కొద్దీ రోజులుగా బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద సరైన సినిమాలు పడడమే లేదు. చిన్న చితక హీరోల సినిమాలు ..మధ్య మధ్య లో పెద్ద హీరోలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం సంతృప్తి పరచడం లేదు. ఈ క్రమంలో నిర్మాతలు రీ రిలీజ్ ల ట్రెండ్ ను మొదలుపెట్టారు. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు.
చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (Mahesh babu Birthday) సందర్బంగా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ మురారి (Murari) ని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 2001 లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీ లో పెళ్లి సాంగ్ ఇప్పటికే అన్ని పెళ్లి ఆల్బమ్ లలో వాడుతున్నారు. అంతలా ఫేమస్ ఈ సాంగ్.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈరోజు ఈ మూవీ రీ రిలీజ్ సందర్బంగా అన్ని థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. రెగ్యులర్ గా మహేష్ సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఉంటాయో..అదే విధంగా మురారి రీ రిలీజ్ సందర్బంగా అలాంటి ఆర్భాటమే చేసారు. వీటి తాలూకా వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అన్ని వీడియోలు ఒక ఎత్తు అయితే.. మురారి సినిమా చూస్తూ ఒక జంట ఏకంగా పెళ్లి చేసుకున్న వీడియో మరో ఎత్తుగా నిలిచింది. ఓ యువకుడు మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు పాట వస్తున్న సమయంలో యువతి మెడలో పసుపు తాడు కట్టాడు. అక్కడున్న వారు అంతా కూడా వారిని తలంబ్రాలతో ఆశీర్వదించడం జరిగింది. మురారిసినిమా అంటే ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి ఏ స్థాయిలో ఇష్టమో అభిమానమో ఈ సంఘటనతో పూర్తిగా అర్థం అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో బాగా షేర్ చేస్తూ వైరల్ చేస్తూ మహేష్ బాబు సత్తా ఏంటో చూపిస్తున్నారు.
Murari ree release full enjoy black buster movie Mahesh Babu 💘💕💕 happy birthday 🎂🎂🎂 pic.twitter.com/3XOjUeGUSF
— @Mahsh NTR 30 (@wthasaap) August 9, 2024
Read Also : Hanuman: డబ్బు,ఆస్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే హనుమంతుడిని ఇలా పూజించాల్సిందే!