Hanuman: డబ్బు,ఆస్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే హనుమంతుడిని ఇలా పూజించాల్సిందే!
డబ్బు అలాగే ఆస్తిపరమైన సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవిని హనుమంతుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:00 PM, Fri - 9 August 24

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు ఉండడం అన్నది సహజం. వాటిని ఎదుర్కొన్నప్పుడే జీవితం సంతోషమయంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది కష్టాలు సమస్యల నుంచి గట్టెక్కించమని దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడే వాటిలో డబ్బు సమస్య కూడా ఒకటి. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని చాలామంది తెగ బాధపడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సంపదకు దేవత అయిన లక్ష్మి, అలాగే హనుమంతుడు వారి ధైర్యానికి ప్రసిద్ధి చెందారు, భక్తికి దేవతలు. వారిని పూజించడం, ఆయా మంత్రాలను జపించడం వల్ల మనలోని బాధలు తొలగిపోతాయట.
మరి లక్ష్మీదేవిని అలాగే హనుమంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లక్ష్మి, హనుమంతల పూజింపడం వల్ల మన సమస్యలు చాలా వరకు తీరుతాయట. ముఖ్యంగా డబ్బు సమస్యలు ఆస్తి సమస్యలు ఉన్నవారు ఎలాంటి పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లక్ష్మీ, హనుమంత పూజల వల్ల మీ ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్న కూడా తీరుతాయట. ప్రతి రాత్రి పడుకునే ముందు హనుమాన్ మంత్రాన్ని జపించాలట. ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయానికి వస్తే.. “మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధమతం వారిష్టం, వటతమజం వానరాయకామ్యముక్కం శ్రీరామ దత్తం సర్ణ సర్పణం” పురుషులు ఈ మంత్రాన్ని జపించి హనుమంతుడిని పూజించవచ్చట.
ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పఠించవచ్చని చెబుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో ప్రతికూల కారకాలతో వ్యక్తికి సమస్యలు ఉంటే, రెండు సాధారణ పరిష్కారాలను అనుసరించవచ్చని చెబుతున్నారు. ప్రతికూల సమస్యలతో బాధపడేవారు హనుమాన్ ఆరాధన లక్ష్మీ ఆరాధన చేయవచ్చట. లక్ష్మీ దేవి ప్రతిమను మీ ఇంట్లో ఉంచుకొని, ఉదయం సాయంత్రం అమ్మవారికి దీపం వెలిగించాలట. అలాగే మీ ఇంట్లో తులసి ఉంటే తులసి చెట్టు వద్ద దీపం వెలిగించాలట. లక్ష్మి దేవి ఆశీస్సులతో మనిషికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. లక్ష్మీ కృపాకటాక్షం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. తామర లేదా కమలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆమె తామర పువ్వు మీద ఆశీనురాలై ఉంటుంది. తామర పువ్వు సంపదకు చిహ్నం. ఈ పువ్వును పూజ గదిలో ఉంచి లక్ష్మీ మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట.. ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయాన్ని వస్తే.
“పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి
విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ ॥
సరసిజ నిలయే సరోజ హస్తే, ధవళత మాంశుక గంధమాల్య శోభే
భగవతి హరి వల్లభే మనోజ్ఞే , త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం”
అలాగే మీరు ధనవంతులు కావాలంటే ఈ మంత్రాన్ని పఠించాలంటే ఓం మహాలక్ష్మీయే నమః అని 11 సార్లు జపిస్తే సరిపోతుందట. ఇది మీ కెరీర్‌ను మెరుగుపరుస్తుందని మీకు ఉద్యోగం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే మంగళవారం రోజు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయట.