Siddhu Jonnalagadda Tillu Square : టిల్లు స్క్వేర్ కి థమన్ సాయం..!
Siddhu Jonnalagadda Tillu Square సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ అవుతుంది. సమ్మర్ రేసుని ఈ సినిమాతో మొదలు పెట్టాలని చూస్తున్న
- By Ramesh Published Date - 09:56 PM, Tue - 13 February 24

Siddhu Jonnalagadda Tillu Square సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ అవుతుంది. సమ్మర్ రేసుని ఈ సినిమాతో మొదలు పెట్టాలని చూస్తున్న టిల్లు టీం అందుకు తగినట్టుగానే ప్రమోషన్స్ మొదలు పెట్టేలా చూస్తున్నారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన డీజే టిల్లు 2022 లో వచ్చి సూపర్ హిట్ కాగా ఇప్పుడు టిల్లు స్క్వేర్ గా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.
టిల్లు స్క్వేర్ సినిమాను మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధుతో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు రాం మిర్యాల, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు. అయితే టిల్లు స్క్వేర్ కు థమన్ మ్యూజిక్ కూడా యాడ్ అవుతుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్ అందిస్తున్నాడని తెలుస్తుంది.
థమన్ సాంగ్స్ కొన్నిసార్లు నెగిటివ్ ట్రోల్స్ అయ్యేలా చేశాయి కానీ బిజిఎం లో అతను ఎప్పుడు డిజప్పాయింట్ చేయలేదు. స్టార్ సినిమాలకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. అయితే టిల్లు స్క్వేర్ సినిమాకు కూడా థమన్ బిజిఎం స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది. థమన్ స్పెషల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. సితార బ్యానర్ బిజిఎం అందిస్తున్నందుకు థమన్ కు మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారని తెలుస్తుంది.