HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Telugu Producers Urge Theatres To Not Give Preference To Dubbed Films On Festivals Move May Affect Varisu Thunivu

Telugu producers: నిర్మాతల మండలి కీలక నిర్ణయం.. మొదటి ప్రాధాన్యత ఆ చిత్రాలకే..!

దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయంలో డబ్బింగ్ మూవీల విడుదల కంటే తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని

  • By Gopichand Published Date - 10:09 PM, Sun - 13 November 22
  • daily-hunt
Jpg
Jpg

దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయంలో డబ్బింగ్ మూవీల విడుదల కంటే తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలలోని చలనచిత్ర నిర్మాతలు ఎగ్జిబిటర్లను కోరారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షేర్ చేసిన ఓ ప్రకటనలో పండుగల సమయంలో థియేటర్లలో తెలుగు స్ట్రెయిట్ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని బాడీ పేర్కొంది. 2023లో సంక్రాంతి వారాంతంలో రెండు పెద్ద తమిళ చిత్రాలు వరిసు, తునివు విడుదల కానున్నాయి. ఆ రెండు సినిమాల వలన తెలుగు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆ పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది: “పెరిగిన తెలుగు చిత్రాల నిర్మాణ వ్యయం, నిర్మాతల సంక్షేమం, తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడటానికి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 08.12.2019 నుండి సంక్రాంతి, దసరా పండుగల సమయంలో కేవలం తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి అనే తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ విషయంపై ఫిల్మ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడు దిల్‌రాజు 2019లో ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. టాలీవుడ్ చిత్రాలు ఉండగా.. డబ్బింగ్‌ చిత్రాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారని గతంలో దిల్‌ రాజు ప్రశ్నించారు. అందువల్లే ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు తప్పకుండా పాటించాలని లేఖలో వివరించింది. సంక్రాతి, దసరా పండుగల సమయంలో తెలుగు సినిమాలకు మొదటి ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్‌ను కోరింది.

Only Telugu straight films should be given preference during Sankranthi & Dussehra – #TFPC #Tollywood pic.twitter.com/1v6HsgviQK

— Aakashavaani (@TheAakashavaani) November 13, 2022

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Telugu Cinema
  • telugu Film iindustry
  • Telugu Film News
  • Telugu producers
  • tollywood

Related News

Chevella Road Accident Bala

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ

    Latest News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

    • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

    • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

    • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd