Ghati : అనుష్క ‘ఘాటి’ సినిమాకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఈగల్ టీమ్
Ghati : ఈ చిత్రంలో గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అవి సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయని వారు పేర్కొన్నారు.
- By Sudheer Published Date - 10:16 PM, Thu - 4 September 25

అనుష్క నటించిన ‘ఘాటి’ (Ghati )చిత్రంపై తెలంగాణలో ‘ఈగల్’ టీమ్ (Telangana Eagle team) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అవి సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయని వారు పేర్కొన్నారు. ఇప్పటికే గంజాయి అమ్మకాలు, వాటి వినియోగంపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలో అలాంటి సన్నివేశాలు చూపించడం సరికాదని ఈగల్ టీమ్ అంటోంది.
New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ఈగల్ టీమ్ నాయకులు మాట్లాడుతూ.. “గంజాయి అనేది ఒక మహమ్మారి. అది యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది. గంజాయి మాఫియాపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇలాంటి సమయంలో, ఒక సినిమాలో గంజాయి క్రయవిక్రయాలను చూపించడం వల్ల యువత ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఇది సమాజంలో నేరాలను పెంచే ప్రమాదం ఉంది.” అని తెలిపారు.
కాబట్టి, సినిమాలోని గంజాయికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఈగల్ టీమ్ డిమాండ్ చేసింది. దీనిపై సినిమా యూనిట్ స్పందించాలని, సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా సినిమాలు ఉండాలని వారు కోరారు. ఒకవేళ ఆ సన్నివేశాలను తొలగించకపోతే, తాము ఆందోళనలు చేపడతామని కూడా వారు హెచ్చరించారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.