Tarakaratna: మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య.. ఈ జన్మకు నువ్వు మాత్రమే చాలంటూ?
దివంగత నటుడు నందమూరి తారకరత్న గురించి మనందరికి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి రోజున గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచిన వ
- Author : Anshu
Date : 05-05-2023 - 5:24 IST
Published By : Hashtagu Telugu Desk
దివంగత నటుడు నందమూరి తారకరత్న గురించి మనందరికి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి రోజున గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా తారకరత్న ఆయన మరణించి దాదాపు 2 నెలలు అవుతున్న ఆయన మరణవార్తను ఇప్పటికీ కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మాట్లాడిన మాటలు ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అయితే అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి తారకరత్న సినిమాలు,రాజకీయాలతో బిజీగా ఉండేవారు.
కానీ వీధి చిన్నచూపు చూడడంతో ఆయన పాదయాత్రలో కుప్పకూలడం ఆ తర్వాత హాస్పిటల్లో 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి అలసిపోయి మరణించడం ఇవన్నీ కూడా ఒక కలలాగే జరిగిపోయింది. తారకరత్న మరణ వార్తను అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతోంది. తరచూ తన భర్తను తలుచుకుంటూ అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అలేఖ్యరెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో మరో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది అలేఖ్య రెడ్డి.
ఈ జీవితానికి నువ్వు నేను మాత్రమే.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళావు.. వాటితో నేను ముందుకు వెళతాను..నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను…అంటూ తారకరత్నని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి. అలాగే మరొక పోస్ట్ చేస్తూ ఆ పోస్ట్ లో తారకరత్న చిన్ననాటి ఫోటోను, తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ.. వీళ్లే నా స్టార్స్ అని రాసుకొచ్చింది అలేఖ్య. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెకు ధైర్యం చెప్పడంతో పాటు ధైర్యంగా ఉండాలి పిల్లల కోసమైనా మీరు ఆ బాధను దిగిమింగుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.