Tamannah : ఓదెల 2.. తమన్నా కి పెద్ద ఛాలెంజ్…!
Tamannah డైరెక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా తన టాలెంట్ చూపిస్తున్న సంపత్ నంది తన నిర్మాణంలో తెరకెక్కిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. ఆహాలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా
- Author : Ramesh
Date : 02-03-2024 - 12:55 IST
Published By : Hashtagu Telugu Desk
Tamannah డైరెక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా తన టాలెంట్ చూపిస్తున్న సంపత్ నంది తన నిర్మాణంలో తెరకెక్కిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. ఆహాలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినింగా వస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటిస్తుంది.
అంతకుముందు సంపత్ నంది డైరెక్ట్ చేసిన రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ సినిమాల్లో నటించిన తమన్నా ఆ డైరెక్టర్ సినిమాలో ఆమె పక్కా అనేలా సెంటిమెంట్ ఏర్పరచుకుంది. ఇక ఇప్పుడు అతను నిర్మిస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది తమన్నా. ఓదెల 2 సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా కాశిలో ప్రారంభించారు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో భాగంగా తమన్నాని ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో తమన్నా నాగ సాధు పాత్రలో కనిపించనుంది. తమన్నాకి కూడా ఇది కెరీర్ లో సరికొత్త పాత్ర అని చెప్పొచ్చు. తమన్నా రాకతో ఓదెల 2 పై సూపర్ బజ్ ఏర్పడింది. మరి ఈ ఛాలెంజింగ్ రోల్ లో తమన్నా ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
Also Read : Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!