Tamannaah Bhatia: మిల్ బ్యూటీకీ పై స్కామ్ ఆరోపణలు.. స్ట్రాంగ్ గా ఇచ్చి పడేసిన తమన్నా!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా పై తాజాగా స్కాం ఆరోపణలు రావడంతో ఆ విషయాలపై ఘాటుగా స్పందించిన మిల్క్ బ్యూటీ వార్నింగ్ ఇచ్చింది.
- By Anshu Published Date - 08:03 AM, Sat - 1 March 25

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేయడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది. టాలీవుడ్ బాలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది.
అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి అలాగే యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది తమన్నా. ఇకపోతే తమన్నా చివరిసారిగా సికందర్ కా ముఖద్దర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే తెలుగు ప్రేక్షకులను ఓదెల 2 మూవీతో పలకరించడానికి సిద్ధమవుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ సంపత్ నంది టీం వర్క్స్ పతాకాలపై డి మధు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది.
ఈ టీజర్ తో ఒకసారి గా మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉంది తమన్నా. ఇది ఇలా ఉండే తాజాగా తమన్నా పై క్రిప్టో కరెన్సీ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. క్రిప్టో కరెన్సీ స్కామ్ లో తమన్నా పాత్ర కూడా ఉంది అంటూ వార్తలు వినిపించాయి. ఇది వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపించడంతో తాజాగా ఈ వార్తలపై స్పందించింది తమన్నా. రూ. 2.4 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్ లో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నాకు ఎలాంటి మోస పూరిత కార్యకలాపాలతో సంబంధం లేదు అంటూ తనపై వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ సమస్యను న్యాయ పరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని కూడా తెలిపింది. తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా తాజాగా క్రిప్టోకరెన్సీ స్కామ్ లో విచారణ కోసం తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్ లను పుదుచ్చేరి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తమన్నా కాస్త ఘాటుగా స్పందించింది.