Taapsee vs Reporter : ప్రశ్న అడిగే ముందు దానికి గురించి తెలుసుకోండి..వైరల్ వీడియో..!!
తాప్సీ పన్ను...ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడూ హ్యాపీగా కనిపించే ఈ అమ్మడికి సడెన్ గా కోపమొచ్చింది.
- By hashtagu Published Date - 09:30 AM, Thu - 15 September 22

తాప్సీ పన్ను…ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడూ హ్యాపీగా కనిపించే ఈ అమ్మడికి సడెన్ గా కోపమొచ్చింది. ఎందుకో తెలుసా…దొబారా సినిమా ఫెయిల్యూర్ పై ఓ రిపోర్టర్ ప్రశ్న అడిగాడు. దానికి స్పందించిన తాప్సీ…భాయ్ ఓ ప్రశ్న అడిగే ముందు దాని గురించి తెలుసుకోండి. అని తనదైనా స్టయిల్లో ఆ రిపోర్టర్ కు చురకలింటించింది.
తాప్సీ నటించిన దొబారా మూవీ నెగెటివ్ క్యాంపెయిన్ పై రిపోర్టర్ ప్రశ్న సంధించాడు. ఏ మూవీకి నెగెటివ్ క్యాంపెయిన్ లేదో చెప్పాలంటూ తాప్సీ రిపోర్టర్ ను ప్రశ్నించింది. అయితే ఆ రిపోర్టర్ తాప్సీ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఈ అమ్మడు అంతటితో ఆగకుండా మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను మీకు సమాధానం చెబుతాను…అని రిపోర్టర్ ను మరోసారి ప్రశ్నించింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.