Swag : శ్రీ విష్ణు సూపర్ అనేస్తున్నారుగా..?
Swag శ్రీ విష్ణు స్వాగ్ అంటూ మరో క్రేజీ అటెంప్ట్ తో వచ్చాడు. స్వాగ్ సినిమాను హసిత్ గోలి డైరెక్ట్ చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా కాస్త కన్ ఫ్యూజ్డ్
- By Ramesh Published Date - 12:44 PM, Sat - 5 October 24
యువ హీరోల్లో కొత్త కంటెంట్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నారు శ్రీ విష్ణు. అతని సినిమా వచ్చింది అంటే కచ్చితంగా ఏదో కొత్త కథ ఉంటుంది అనుకునేలా చేశాడు. లేటెస్ట్ గా శ్రీ విష్ణు స్వాగ్ అంటూ మరో క్రేజీ అటెంప్ట్ తో వచ్చాడు. స్వాగ్ (Swag) సినిమాను హసిత్ గోలి డైరెక్ట్ చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా కాస్త కన్ ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే అన్న టాక్ వినిపిస్తున్నా యూత్ ఆడియన్స్ మాత్రం బాగానే కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది.
సినిమా గురించి సోషల్ మీడియాలో బాగానే డిస్కషన్ జరుగుతుంది. న్యూ ఏజ్ ఫిల్మ్ రైటింగ్స్ తో హసిత్ గోలి అటెంప్ట్ బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఐతే వాళ్లు చెప్పినంత రేంజ్ లో ఏమి లేదు అంటున్న వారు ఉన్నారు. టాక్ ఎలా ఉన్నా వసూళ్లు ఎలా ఉన్నా శ్రీవిష్ణు యాక్టింగ్ లో మాత్రం సూపర్ అనేస్తున్నారు. ఈ సినిమాలో ఏకంగా 4 వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించి అలరించాడు శ్రీ విష్ణు.
నాలుగు రకాల పాత్రలు..
ఎంచుకున్న పాత్రలో తన నటనతో మెప్పించాడు. ఒకే సినిమాలో ఇలా నాలుగు రకాల పాత్రలు అది కూడా దేనికి దానికి సెపరేట్ అన్నట్టుగా చేయడం తనకే సాధ్యమైంది. ఈ సినిమా చూసిన తర్వాత శ్రీ విష్ణు టాలెంట్ పూర్తిగా అర్ధమవుతుంది. శ్రీ విష్ణు (Sri Vishnu) మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఎమోషనల్ టచ్ గా స్వాగ్ మెప్పించింది.
స్వాగ్ సినిమాలో రీతు వర్మ కూడా వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించింది. సినిమాకు టాక్ మిశ్రమంగా వచ్చినా ఎలాగు హాలీడేస్ కాబట్టి కచ్చితంగా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఐతే సామజవరగమన, ఓం భీం బుష్ సినిమాలతో సక్సెస్ అందుకున్న శ్రీవిష్ణు స్వాగ్ తో హిట్ కొడతాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.