Casting Couch : ఓ డైరెక్టర్ ముద్దు పెట్టబోయాడు – ‘రానా నాయుడు’ నటి
Casting Couch : ముంబైలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఓ దర్శకుడు తన పెళ్లైన విషయాన్ని తెలిసినా ఆఫీసులో కిస్ చేయడానికి యత్నించాడని చెప్పి షాక్ ఇచ్చింది
- By Sudheer Published Date - 08:16 AM, Sat - 31 May 25

ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్ 4 వెబ్ సిరీస్(Criminal Justice 4 web series)తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి సురవీన్ చావ్లా (Surveen Chawla) తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. ముంబైలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఓ దర్శకుడు తన పెళ్లైన విషయాన్ని తెలిసినా ఆఫీసులో కిస్ చేయడానికి యత్నించాడని చెప్పి షాక్ ఇచ్చింది. “మేమిద్దరం నా పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పటికీ, నేను బయటకు వెళ్లేటప్పుడు ఆ డైరెక్టర్ నన్ను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. అతన్ని నెట్టివేసి నేను అక్కడి నుంచి బయటపడ్డా” అని పేర్కొన్నారు.
సురవీన్ చావ్లా సౌత్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న మరొక బాధాకర అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఓ సౌత్ డైరెక్టర్, తన అభ్యంతకరమైన డిమాండ్‌ను చెప్పేందుకు ఇంగ్లీషు లేదా హిందీ రాని కారణంగా మధ్యవర్తిగా తన స్నేహితుడిని ఉపయోగించాడని, షూటింగ్ సమయంలో తనతో రాత్రి గడిపేలా చెప్పినట్టు వెల్లడించారు. ఈ డిమాండ్ విని తాను షాక్‌కు గురయ్యానని చెప్పిన ఆమె, పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే వివక్షను తీవ్రంగా ఆవేదనతో వివరించారు.
Fortuner: నదిలో ఇరుక్కున్న కారు… శంకరనారాయణన్ వచ్చాడు, లాగేశాడు!
ఇంకొక ఇంటర్వ్యూలో సురవీన్ చావ్లా, సినిమాల్లో ఎంపిక ప్రక్రియలో మహిళలు ఎదుర్కొనే బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు. “మీ సైజులు ఎంత? నడుమెంత? బరువు తగ్గించుకోగలవా?” వంటి ప్రశ్నలతో ఆడవాళ్లను తక్కువగా భావించడం చూస్తే బాధగా ఉంటుంది” అని ఆమె అన్నారు. టాలెంట్ కన్నా లుక్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ఇలా పరిశ్రమలోని అనేక అనుభవాల మధ్య తన స్థానాన్ని ఏర్పరచుకున్న సురవీన్ నిజంగా స్పూర్తిదాయకురాలని చెప్పొచ్చు.
సురవీన్ చావ్లా 2003లో టీవీ సీరియల్ కహీన్ తో హోగాతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. కసౌటి జిందగీకి, 24, కాజల్ వంటి సీరియల్స్‌లో నటించారు. 2008లో కన్నడ సినిమా పరమేశా పానవాలాతో సౌత్ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. హేట్ స్టోరి 2, అగ్లీ, పార్చ్డ్ వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా మెప్పించారు. అలాగే సేక్రెడ్ గేమ్స్తో ఓటీటీ లోకి వచ్చారు. ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్ 4లో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 13న విడుదల కానున్న రాణా దగ్గుబాటి నటించిన రాణా నాయకుడు 2లో కూడా ఆమె కనిపించనున్నారు.