The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ విచారణపై సుప్రీం నిరాకరణ
'ది కేరళ స్టోరీ' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ మొదలైంది. గతంలో ఈ సినిమాను కాంగ్రెస్ వ్యతిరేకించింది.
- By Praveen Aluthuru Published Date - 01:00 PM, Tue - 2 May 23

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ మొదలైంది. గతంలో ఈ సినిమాను కాంగ్రెస్ వ్యతిరేకించింది. సినిమా ట్రైలర్‌లో హిందూ అమ్మాయిలను బ్రెయిన్‌వాష్ చేసి మతం మార్చినట్లు చూపుతున్నారు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం 32,000 మంది హిందూ యువతులను మతమార్పిడి చేసి ఐఎస్ స్థావరాలకు తీసుకెళ్లారు. దీంతో సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
‘ది కేరళ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో కూరుకుపోయింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది నిజాం పాషా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
‘ది కేరళ స్టోరీ’ చిత్రం ట్రైలర్‌ను ఇప్పటివరకు 1.6 కోట్ల మంది వీక్షించారని జస్టిస్‌లు కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనానికి కపిల్ సిబల్, నిజాం పాషా తెలిపారు. పాషా మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో అసభ్యకరమైన భాషను ఉపయోగించారని పిటిషన్ లో పేర్కొన్నారు.