Rajinikanth : కండక్టర్ గా పనిచేసిన బస్ డిపో ను సందర్శించిన రజనీకాంత్..
కండెక్టర్ ఉద్యోగం పూర్తి అయిన తరువాత ఇదే ప్రాంతాల్లోని థియేటర్‌లో సినిమాలు చూశానని
- By Sudheer Published Date - 08:38 PM, Tue - 29 August 23

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్ (BUS Conductor) గా పనిచేసిన సంగతి తెలిసిందే. బెంగళూరులో పుట్టి పెరిగిన రజని.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ( BMTC)లో బస్ కండక్టర్ గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. బీటీఎస్ కండెక్టర్ గా ఉద్యోగం చేసిన రజనీకాంత్ ..నాటకాల మీద మోజు పెంచుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం 70 ఏళ్ల కు వచ్చినప్పటికీ ఆయన క్రేజ్ రవ్వంత కూడా తగ్గలేదు.
రీసెంట్ గా జైలర్ (Jailer movie) మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కేవలం రెండు వారాల్లో ఈ మూవీ రూ.600 కోట్లు కొల్లగొట్టి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ క్రమంలోనే రజినీ కాంత్ బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులోని జయనగర్ (Jayanagar ) బీఎంటీసీ డిపోను రజినీ సందర్శించారు.
Read Also : Chandrayaan-3: చంద్రుడి రహస్యాలను వెలికితీసే పనిలో ప్రజ్ఞాన్ రోవర్
మంగళవారం ఉదయం 11.30 గంటలకు బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోకు చేరుకున్నారు. ఆయన రాక పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. 11.45 వరకు రజినీ కాంత్ బీఎంటీసీ డిపోలోనే ఉన్నారు. అక్కడి సిబ్బంది కలిసి మాట్లాడారు. డిపో మేనేజర్ తో పాటు మెకానిక్ సిబ్బంది, కార్మికులు, బస్ డ్రైవర్లు, కండక్టర్లను పలకరించారు. కాసేపు ఆ డిపోలో కలియ తిరిగారు. గతంలో అక్కడ ఆయన తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సిబ్బందితో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. సిబ్బంది తనతో సెల్ఫీలు తీసుకుంటే ఎవరినీ వారించకుండా వారికి సహకరించారు. రజినీ కాంత్ ఈ సర్‌ప్రైజ్ కార్యక్రమంతో డిపో సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. రజినీ కాంత్ డిపోకు వచ్చినప్పుడు ఆయన చిన్ననాటి స్నేహితుడు రాజ్ బహదూర్ (Raj Bahadur) కూడా రజనీకాంత్ ఉన్నారు.
కండెక్టర్ ఉద్యోగం పూర్తి అయిన తరువాత ఇదే ప్రాంతాల్లోని థియేటర్‌లో సినిమాలు చూశానని, ఆ రోజుల్లో తాను బెంగుళూరు చుట్టానని, తరువాత సినిమాల్లోకి వెళ్లానని రజనీకాంత్ ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
Actor @rajinikanth surprised everyone by visiting a @BMTC_BENGALURU Depot in today. He was working as a bus conductor in #Bengaluru before his entry into the cinema and was put on the route 10A in BMTC. @THBengaluru @the_hindu pic.twitter.com/2qLmsqKWXz
— Darshan Devaiah B P (@DarshanDevaiahB) August 29, 2023