Rajinikanth: కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth) ఆరోగ్యం నిలకడగానే ఉంది.
- By Pasha Published Date - 08:54 AM, Tue - 1 October 24

Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పి రావడంతో సోమవారం అర్ధరాత్రి టైంలో ఆయన చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వెంటనే ఆయనకు చికిిత్స చేశారు. ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth) ఆరోగ్యం నిలకడగానే ఉంది. రజనీ బాగానే ఉన్నారని ఆయన సతీమణి లత వెల్లడించారు. ప్రస్తుతం వేట్టయాన్, కూలీ సినిమాల్లో రజనీకాంత్ నటిస్తున్నారు. వేట్టయాన్ మూవీ అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెట్టైయాన్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
Also Read :LPG Cylinder Price: పండగకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు..!
గతంలో రజినీకాంత్ మెదడు రక్తనాళంలో బ్లాక్స్ ఏర్పడ్డాయి. దీంతో ఆయన అప్పట్లో చెన్నై నగరంలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్యులు చికిత్స చేసి ఆ బ్లాక్స్‌ను తొలగించి, మెదడుకు సరిగా రక్త ప్రసరణ జరిగేలా చేశారు. రక్తనాళంలో ఉన్న బ్లాక్స్‌ను తొలగించిన ప్రదేశంలో యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ వేశారు. సుమారు పదేళ్ల క్రితం సింగపూర్‌లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు.
Also Read :Cardamom Benefits : క్యాన్సర్‌తో సహా ఈ 6 వ్యాధులను నివారించడానికి ఏలకులు తినండి
- 80వ దశకంలో దక్షిణాది సినీ ప్రపంచంలో రజనీకాంత్ రారాజు. ఆయన అప్పట్లోనే భారీ పారితోషికం పుచ్చుకునేవారు.
- అప్పట్లో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన మూవీ బిల్లా. ఇది రజనీకాంత్‌కు మంచి సక్సెస్ ఇచ్చింది.
- బిల్లా మూవీలో రజనీకాంత్‌తో నటించే ఛాన్స్ జయలలితకు వచ్చినా నో చెప్పారు. ఆమె అప్పటికే రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఇక సినిమాల్లో నటించలేనని చెప్పారు.
- దీంతో అప్పట్లో నటి శ్రీప్రియకు రజనీకాంత్‌తో నటించే ఛాన్స్ ఇచ్చారు.
- జయలలిత సినీ కెరీర్ 1965 సంవత్సరంలో ‘వెన్నిరా ఆడై’ అనే సినిమాతో మొదలైంది.