Allari Naresh : ‘ఆర్య’ సినిమా అల్లరి నరేష్ చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్..
ఆర్య మూవీ అల్లు అర్జున్ చేయాల్సింది కాదట. ఆ కథని సుకుమార్.. అల్లరి నరేష్ కోసం రాసుకున్నారట.
- Author : News Desk
Date : 03-04-2024 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Allari Naresh : అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘ఆర్య'(Arya). దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 2004లో రిలీజయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. ‘ఫీల్ మై లవ్’ అంటూ ప్రేమకథని ఓ కొత్త కోణంలో ఆడియన్స్ కి చూపించడంతో బాగా నచ్చేసింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకి ముందు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చేసారు.
అయితే ఆర్య మూవీ అల్లు అర్జున్ చేయాల్సింది కాదట. ఆ కథని సుకుమార్.. అల్లరి నరేష్ కోసం రాసుకున్నారట. ఈ విషయాన్ని సుకుమార్ ఓ సందర్భంలో తెలియజేసారు. ‘అల్లరి’ సినిమాలో నరేష్ నటన చూసి సుకుమార్ చాలా ఇంప్రెస్స్ అయ్యారట. దీంతో ఆయనతో సినిమా చేయాలని.. నరేష్ ని దృష్టిలో పెట్టుకొని ఆర్య కథని రాసుకున్నారు. కానీ కొన్ని కారణాలు వల్ల అల్లరి నరేష్ చేయడం కుదరలేదు. దీంతో ఆర్యని అల్లు అర్జున్ తో చేయాల్సి వచ్చింది.
ఇక్కడ విశేషం ఏంటంటే.. అల్లరి నరేష్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్న సుకుమార్, ఆ కథని అసలు ఆయనకు వినిపించలేదు. అసలు ఆర్య సినిమా తనతోనే చేయాల్సింది అనే విషయం.. నరేష్ కి మూవీ రిలీజైన ఏడేళ్లకు తెలిసింది. సుకుమార్ ‘100% లవ్’ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో అల్లరి నరేష్ ని కలుసుకున్నారట. ఆ సమయంలో నరేష్ కి సుకుమార్ అసలు విషయం చెప్పారు.
“నిజానికి ఆర్య కథ మీ కోసం రాసుకున్నాను” అని నరేష్ కి సుకుమార్ చెప్పారట. అప్పటివరకు నరేష్ కి కూడా ఈ నిజం తెలియదు. అయితే ఆ సినిమా చేయడం కుదరకపోయినా నరేష్ తో మరో సినిమా చేయాలని సుకుమార్ ఆశ పడ్డారు. అయితే ఈసారి తాను దర్శకుడిగా కాకుండా నిర్మాతగా వ్యవహరించాలని భావించారు. అందుకోసం తానే కథ కూడా సిద్ధం చేశారట. కానీ ఎందుకో తెలియదు, ఆ ప్రాజెక్ట్ కూడా సెట్ అవ్వలేదు.
Also Read : The General : సైలెంట్ ఫిలిం హిస్టరీలోనే.. అత్యంత ఖరీదైన సీన్ అదే.. వందేళ్ల క్రితమే..