Sudheer Babu : ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా.. ఒక స్టార్ సిస్టర్.. మరో స్టార్ వైఫ్..!
Sudheer Babu సినీ తారల పర్సనల్ లైఫ్ విషయాల మీద ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్
- Author : Ramesh
Date : 29-05-2024 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
Sudheer Babu సినీ తారల పర్సనల్ లైఫ్ విషయాల మీద ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. ఇదే క్రమంలో ఒక హీరో తన సతీమణి ఫోటోని షేర్ చేశాడు. నేడు వారి పెళ్లిరోజు కాబట్టి ఈ సందర్భంగా తన భార్య పెళ్లిచూపుల ఫోటో షేర్ చేశాడు సదరు హీరో. భార్య ఫోటో షేర్ చేసి ప్రియా నీ వల్లే నా జీవితం ఫుల్ ఫిల్ అయ్యిందని కామెంట్ పెట్టాడు.
ఐతే ఆ హీరో షేర్ చేసిన ఆ ఫోటో ఒక స్టార్ హీరో సిస్టర్ కూడా.. ఇంతకీ ఆ ఫోటో షేర్ చేసింది ఎవరు.. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు.. ఆమె ఎవరి సిస్టర్ అంటే.. ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేష్ సొదరి పద్మ ప్రియదర్శిని అని తెలుస్తుంది. సుధీర్ బాబు సతీమణి పద్మ ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోని షేర్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాడు సుధీర్ బాబు.

ఆ ఫోటోని క్లియర్ గా చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గారి ముఖ చాయలు కనిపిస్తాయి. ఘట్టమనేని అల్లుడిగా సుధీర్ బాబు హీరోగా ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన హరోం హర సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. అసలైతే ఆ సినిమాను మే 31న రిలీజ్ చేయాలని అనుకోగా అది జూన్ 7కి వాయిదా వేశారు.
Also Read : Allari Naresh Bacchala Malli First Look Poster : నరేష్ ఊర మాస్.. బచ్చల మల్లి ఫస్ట్ లుక్ అదిరిందిగా..!