SSMB29 Update: మహేష్- రాజమౌళి మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్!
నిర్మాతల ప్రకటన ప్రకారం.. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు, రాజమౌళి అభిమానులకు అద్భుతమైన అవకాశం లభించింది. వీరు టైటిల్ విడుదల రోజునే అల్ ఘురైర్ సెంటర్‌లోని స్టార్ సినిమాస్‌లో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా లైవ్ వీక్షించవచ్చు.
- By Gopichand Published Date - 05:25 PM, Wed - 12 November 25
SSMB29 Update: ప్రపంచ సినిమా ప్రేక్షకులు ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో (SSMB29 Update) పిలవబడుతున్న ఈ గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు అయ్యింది.
మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ నవంబర్ 15, 2025న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: Sarpamitra : సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతున్న ఏపీ సర్కార్
భారత్, విదేశాల్లో లైవ్ స్ట్రీమింగ్ హక్కులు
భారతదేశంలోని ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఈ టైటిల్ లాంఛ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రత్యేకంగా దక్కించుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్, రాజమౌళి అభిమానుల నుంచి లైవ్ వీక్షణ కోసం అపారమైన డిమాండ్ రావడంతో మేకర్స్ తాజాగా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించారు.
దుబాయ్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్
నిర్మాతల ప్రకటన ప్రకారం.. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు, రాజమౌళి అభిమానులకు అద్భుతమైన అవకాశం లభించింది. వీరు టైటిల్ విడుదల రోజునే అల్ ఘురైర్ సెంటర్‌లోని స్టార్ సినిమాస్‌లో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా లైవ్ వీక్షించవచ్చు. ఇది విదేశీ అభిమానులకు మేకర్స్ ఇచ్చిన గొప్ప ట్రీట్‌గా చెప్పవచ్చు. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ (US), యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వంటి ఇతర కీలక అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా త్వరలోనే మరిన్ని ఆశ్చర్యకరమైన అప్‌డేట్‌లను విడుదల చేసే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రధాన తారాగణం
కేఎల్ నారాయణ్‌కు చెందిన శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్స్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. టైటిల్ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రకటన కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.