Srileela : శ్రీలీలకు మరో లక్కీ ఛాన్స్..?
Srileela పూజా హెగ్దే ఆ తర్వాత మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ శ్రీలీల పట్టేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 లో కిసిక్ సాంగ్ తో గ్లామర్ బ్లాస్ట్ తో అలరించిన శ్రీలీల
- By Ramesh Published Date - 09:06 AM, Wed - 11 December 24

ఈ ఇయర్ మొదట్లో గుంటూరు కారం సినిమాలో నటించిన శ్రీలీల (Srileela) ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ లో పుష్ప్ 2 లో కిసిక్ సాంగ్ తో పాటు ఎండింగ్ లో నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో రాబోతుంది. శ్రీలీల నెక్స్ట్ సినిమా కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది. నాగ చైతన్య హీరోగా విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇద్దరి ముగ్గురు పేర్లు వినిపించాయి.
ముందు పూజా హెగ్దే ఆ తర్వాత మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ శ్రీలీల పట్టేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 లో కిసిక్ సాంగ్ తో గ్లామర్ బ్లాస్ట్ తో అలరించిన శ్రీలీల రాబిన్ హుడ్ (Rabinhood) తో ఎంటర్టైన్ చేయనుని. తప్పకుండా ఈ సినిమాతో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకుంది అమ్మడు.
ఫిబ్రవరిలో రిలీజ్..
నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేశరు. విరూపాక్ష తో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు నెక్స్ట్ సినిమా నెక్స్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. మరి చైతన్యతో శ్రీలీల రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా ఎలా అలరిస్తుందో చూడాలి.
శ్రీలీల కు రాబిన్ హుడ్ హిట్ పడితే మాత్రం అమ్మడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. రీసెంట్ గా అమ్మడు నవీన్ పొలిశెట్టితో కలిసి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నది.
Also Read : Satyadev Zebra : సత్యదేవ్ జీబ్రా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?