Satyadev Zebra : సత్యదేవ్ జీబ్రా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
Satyadev Zebra ఈ సినిమా థియేట్రికల్ రన్ లో మంచి టాక్ తెచ్చుకుంది. ఐతే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. ఐతే జీబ్రా సినిమా ఓటీటీ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
- By Ramesh Published Date - 08:55 AM, Wed - 11 December 24

యువ హీరో సత్యదేవ్ (Satyadev) లీడ్ రోల్ లో నటించిన సినిమా జీబ్రా. కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటున్న సత్యదేవ్ తన లేటెస్ట్ మూవీ జీబ్రాతో కూడా మరోసారి సూపర్ అనిపించేశాడు. ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాగా త్వరలోనే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈ సినిమాను ఆహా ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది. ఆహా లో ఈ నెల 13న ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. సత్యదేవ్ సరసన ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటించింది. సినిమాలో జెన్నిఫర్ పిస్సినాటో కూడా నటించింది. నవంబర్ 22న థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. డిసెంబర్ 13న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది జీబ్రా (Zebra,). జీబ్రా సినిమా ఈవెంట్ లో చిరంజీవి గెస్ట్ గా రావడంపై ఎక్కువ ప్రచారం పొందింది. సినిమా ఓటీటీలో ఆడియన్స్ ని మెప్పిస్తుందేమో చూడాలి.
ఆశించిన స్థాయిలో కలెక్షన్స్..
ఈ సినిమా థియేట్రికల్ రన్ లో మంచి టాక్ తెచ్చుకుంది. ఐతే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. ఐతే జీబ్రా సినిమా ఓటీటీ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. జీబ్రా సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా ఉన్నారు. మరి ఈ సినిమా డిజిటల్ రిలీజ్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
సత్యదేవ్ టాలెంట్ కి సూపర్ హిట్ రావాలి కానీ ఎందుకో సరైన సినిమా పడట్లేదు. తెలుగు యువ హీరోల్లో సత్యదేవ్ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ సినిమాలో ధనుంజయ్ కూడా నటించాడు. సినిమాలో అతనిది సత్యదేవ్ కు ఈక్వల్ రోల్ ఇచ్చారు.