Om Bheem Bush Teaser : ఓం భీమ్ బుష్ టీజర్.. కామెడీ తో హిట్టు కొట్టేలా ఉన్నారే..!
Om Bheem Bush Teaser హుషారు డైరెక్టర్ శ్రీ హర్ష డైరెక్షన్ లో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటిస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాను యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ కలిసి నిర్మిస్తున్నారు.
- By Ramesh Published Date - 08:27 PM, Mon - 26 February 24

Om Bheem Bush Teaser హుషారు డైరెక్టర్ శ్రీ హర్ష డైరెక్షన్ లో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటిస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాను యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
A టు Z సర్వీస్ అంటూ ముగ్గురు వ్యక్తులు సిటీ నుంచి విలేజ్ కు వస్తారు. అలా వచ్చిన వారు విలేజ్ లో ఏం చేశారు. అక్కడ జరిగిన సంఘటనల వల్ల వారు ఎలా రిస్క్ లో పడ్డారు.. వాటి నుంచి వారి ఎలా బయట పడ్డారు అన్నదే సినిమా కథ. ఓం భీమ్ బుష్ టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను నవ్వించేస్తుందని చెప్పొచ్చు.
శ్రీవిష్ణు లాస్ట్ ఇయర్ సామజవరగమనతో హిట్ అందుకున్నాడు. ఆ హిట్ జోష్ తోనే ఈసారి ఓం భీమ్ బుష్ అంటూ మరో కామెడీ అటెంప్ట్ తో వస్తున్నాడు. ఈ సినిమా మార్చి 22న రిలీజ్ లాక్ చేశారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.