Sivakarthikeyan : సెలవు రోజున షాక్ ఇచ్చిన శివ కార్తికేయన్ సినిమా.. ఇక ధనుష్ సినిమా ఏ దిక్కు!
ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఒకటి, శివ కార్తికేయ (Sivakarthikeyan) నటించిన అయలాన్ మరొకటి. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తయారైన ఈ సినిమా తమిళనాడులో గతవారం రిలీజ్ అయింది.
- By Vamsi Chowdary Korata Published Date - 11:48 AM, Sat - 27 January 24

Sivakarthikeyan : సెలవులు వస్తున్నాయంటే అందరి దృష్టి సినిమాల మీదే పడుతుంది. సిల్వర్ స్క్రీన్ పై ఏం సినిమాలు వస్తున్నాయి, ఓటీటీ లో ఏం సినిమాలు వస్తున్నాయి అంటూ ఇంటర్నెట్ లో సెర్చింగ్ లు మొదలు పెడతారు. సినిమా వాళ్లు కూడా ఇలాంటి లాంగ్ వీకెండ్స్ కోసమే చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయాలలోనే డబ్బింగ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ముందు క్యూ కడతాయి.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ఈరోజు రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఒకటి, శివ కార్తికేయ (Sivakarthikeyan) నటించిన అయలాన్ మరొకటి. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తయారైన ఈ సినిమా తమిళనాడులో గతవారం రిలీజ్ అయింది. ఈవారం తెలుగులోకి అడుగు పెట్టవలసిన సినిమా ఇది. అయితే కొన్ని కారణాల వలన ఈ షోస్ అని రద్దయ్యాయి.
ఉదయం 10:00 ఆటలకు టిక్కెట్లు అమ్మిన తరువాత థియేటర్ యజమాన్యం సారీ చెప్పి మరీ డబ్బులు వాపస్ ఇచ్చేసింది. మార్నింగ్ షో మాట్నీ ఆటలు అన్ని రద్దవుతున్నాయి. శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సినిమా ఆర్థిక సమస్యలతో విడుదలకు బ్రేక్ పడిందని అందుకే షోలు రద్దు అవుతున్నాయని సినీ వర్గాల సమాచారం. రిపబ్లిక్ డే రోజు సెలవుని క్యాష్ చేసుకోవాలనుకున్నాయి అలయాన్, కెప్టెన్ మిల్లర్. అయితే ఆలయాన్ అనుకోని కారణాల వలన పోటీ నుంచి తప్పుకుంది.
ఎలాగైనా రిలీజ్ కి క్లియరెన్స్ తెచ్చుకోవాలని తెలుగు నిర్మాతలు తాపత్రయపడుతున్నారు. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమాకి పోటీ లేకుండా పోయింది. ఆల్రెడీ ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది, అలాగే పోటీగా రావలసిన అలయాన్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఉన్న ఏకైక దిక్కు ధనుష్ సినిమా కెప్టెన్ మిల్లర్ మాత్రమే. వచ్చే మూడు రోజులు సెలవు కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు కలెక్ట్ చేస్తుందో అంటున్నారు ప్రేక్షకులు.
Also Read: Mega Family : మెగా కుటుంబమా మజాకా.. కుటుంబంలో అందరికీ అవార్డులే