Shruti Hassan : స్టార్ హీరోయిన్ కి పెళ్లి వద్దంట కానీ.. అది మాత్రం..!
Shruti Hassan శృతి హాసన్ ఇలానే ఒకరితో చాలా కాలం కలిసి డేటింగ్ చేసింది. ఐతే శాంతానాను పెళ్లి చేసుకుంటారా అని కొందరు అడిగితే అప్పుడు ఆన్సర్ దాటేసిన శృతి హాసన్ లేటెస్ట్ గా దానికి క్లారిటీ
- By Ramesh Published Date - 11:19 PM, Thu - 26 December 24

సౌత్ స్టార్ హీరోయిన్ కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. శృతి హాసన్ ఒక హీరోయిన్ గానే కాదు తన పర్సనల్ మ్యాటర్స్ తో కూడా వార్తల్లో ఉంటుంది. అమ్మడు లవ్ ఎఫెయిర్స్ పై స్పెషల్ కవరేజ్ ఉంటుంది. కోలీవుడ్ లో శృతిహాసన్ లో వస్తున్న వార్తలు మరే హీరోయిన్ మీద రావు. ఐతే శృతి హాసన్ ప్రస్తుతం సోలోగా ఉంటుంది. మొన్నటిదాకా ఆమె శాంతాను హజారికాతో డేటింగ్ చేసింది. ఐతే ఈమధ్య వీళ్లిద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు.
అంతకుముందు కూడా శృతి హాసన్ ఇలానే ఒకరితో చాలా కాలం కలిసి డేటింగ్ చేసింది. ఐతే శాంతానాను పెళ్లి చేసుకుంటారా అని కొందరు అడిగితే అప్పుడు ఆన్సర్ దాటేసిన శృతి హాసన్ లేటెస్ట్ గా దానికి క్లారిటీ ఇచ్చింది. తనకు ప్రేమ, రొమాన్స్ వరకు ఓకే కానీ పెళ్లి మాత్రం వద్దని అంటుంది అమ్మడు. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలని అనుకోనని అంటుంది.
మరి పెళ్లి వద్దు కానీ మిగతావి అన్నీ కావాలని అంటున్న శృతి హాసన్ కామెంట్స్ కు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అంతేకాదు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఇక మీదట తనను ఎవరు ఆ ప్రశ్న అడగొద్దని అన్నరు శృతి హాసన్. ఆమె ఇలా అనడానికి తన పేరెంట్స్ విడిపోవడమే అన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా శృతి హాసన్ ఎప్పటికీ పెళ్లి లేకుండా సోలోగానే ఉంటుందా అన్న విషయంపై ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింటెడ్ గా ఉన్నారు.