HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shriya Saran Opens Up About Her Upcoming Film Gamanam

Interview: గమనం కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి – శ్రియ స‌ర‌న్‌

గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.

  • By Hashtag U Published Date - 10:46 PM, Tue - 7 December 21
  • daily-hunt
Dsc 5758 1600x1070 Imresizer
Shriya Saran

గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి. ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు

ఇరవై ఏళ్లు ఇలా మీ ముందు ఉన్నాను. మొదట ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా నేను మీ పక్కింటి అమ్మాయిలా మారిపోయాను. మా అమ్మ మ్యాథ్స్ టీచర్. మా నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పని చేసేవారు. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు నాకు ఎంతో ప్రేమ దొరికింది. ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నేను చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ అయ్యాయి. ఇంకొన్ని వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుక ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఇరవై ఏళ్లు నటిస్తూ ఇలానే ఉండాలని ఉంది.

కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పనులు లేకుండా అవస్థలు పడ్డారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. ఏఎన్నార్ గారు మనం సినిమా టైంలో చివరి క్షణం వరకు నటించారు. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఒకవేళ నేను చనిపోతే.. ఈ సినిమా చేసే చనిపోతాను అని అనేవారు. అలా నేను కూడా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉంటాను.

సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసినా గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను. ఈ కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి. ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

ఇది వరకు నేను మహిళ దర్శకురాళ్లతో పని చేశాను. మిడ్ నైట్ స్టోరీస్ అని ఓ సినిమా చేశాను. కన్నడలో కూడా ఓ చిత్రం చేశాను. తెలుగులో మాత్రం ఇలా మహిళా దర్శకురాలితో చేయడం మొదటిసారి. మహిళా దర్శకురాళ్లతో పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలున్నా కూడా ఎంతో ఓపెన్‌గా చెప్పొచ్చు. ఇంతకు ముందు మహిళలు కెమెరా వెనకాల ఉండేవారు. కానీ ఇప్పుడు కెమెరా ముందు కూడా కనిపిస్తున్నారు.

ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు. కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను.

మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే గమనం. మనల్ని మనం తెలుసుకునేలా చేసే కథ గమనం. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని మనం అధిగమించేస్తాం. నా డెలివరీ సమయంలోనూ నాకు ఇలాంటి ఓ భయం ఉండేది. కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను. అంతా సాఫీగానే సాగింది. లైఫ్‌లో అందరికీ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. దాన్నుంచి ఎలా బయటకు వస్తామని చెప్పేదే గమనం.

నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను. నేను ఇందులో ఒక రూంలోనే ఉంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా విజయం. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

Mur 0043 1600x1067 Imresizer

Shriya Saran

గమనం సినిమాలో మూడు కథలు ఒకే టైంలో సాగుతాయి. ప్రతీ స్టోరీ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకుంటారు. వారు ఎలా బయటపడ్డారు అనేదే కథ. ఇది ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కాదు.

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. ఇది సరైన సమయం కాదు. రాజమౌళి సర్‌తో చాలా ఏళ్ల తరువాత పని చేశారు. ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా. రాజమౌళి సర్ చెప్పినప్పుడు మేం మాట్లాడతాం.

సాయి మాధవ్ బుర్రా గారు ఎంతో ఎమోషనల్‌గా డైలాగ్స్ రాస్తారు. మూలాల్లోంచి ఆయన డైలాగ్స్ రాస్తారు. చిన్న డైలాగ్స్ రాసినా కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. నాకు కెమెరామెన్ బాబా గారిపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన ఓకే చెప్పారంటే అది అద్భుతంగా వచ్చినట్టే. ఇళయరాజా గారితో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

ప్రతీ సినిమాతో ఏదో ఒకలా కనెక్ట్ అవుతాం. బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది.

ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది.

నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోలేను. హిందీలో అయితే డబ్బింగ్ చెప్పుకోగలను. కానీ అంత డేర్ మాత్రం దర్శక నిర్మాతలు చేయరేమో (నవ్వులు).

పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం.

Dsc 5779 1600x1067 Imresizer

Shriya Saran


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Charuhasan
  • deaf and dumb school
  • gamanam
  • nithya menen
  • Priyanka Jawalkar
  • Shriya Saran
  • Siva Kandukuri
  • Suhas
  • tollywood
  • tollywood actor

Related News

Telusu Kada

Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. స్టైలిష్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ.. శుక్రవారం (అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చి

  • Kantara Chapter 1 Deepavali

    Kantara : 3 నిమిషాల్లో సినిమా మొత్తం చూపించేశారుగా!

  • Telangana Forest Movie Shoo

    Telangana Forests : తెలంగాణ ల్లో 70 షూటింగ్స్ లొకేషన్లు రెడీ..!

  • Mana Shankara Varaprasad Ga

    Chiranjeevi : మీసాల పిల్ల పాట రిలీజ్ చేసి అనిల్ రావిపూడి తప్పు చేశారా?

  • sai durga tej

    Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd