Mahesh Shocking TRP: మహేష్ మూవీకి లోయెస్ట్ టీఆర్పీ!
మహేష్ బాబు స్మాల్ స్క్రీన్ లోనూ పాపులర్. ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ.
- Author : Balu J
Date : 07-10-2022 - 3:59 IST
Published By : Hashtagu Telugu Desk
మహేష్ బాబు స్మాల్ స్క్రీన్ లోనూ పాపులర్. ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. మహేశ్ సినిమాలు సాధారణంగా బుల్లితెరపైకి వచ్చినప్పుడు బాగా ఆడతాయి. సరిలేరు నీకెవ్వరు మొదటి టెలివిజన్ స్క్రీనింగ్ సమయంలో 23.4 TRP నమోదు చేసింది సంచలనం కలిగించింది. అయితే, మహేష్ లెటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ స్టార్ మాలో ప్రసారమైంది.
టీవీ స్క్రీనింగ్‌లో తక్కువ TRP నమోదు కావడంతో అభిమానులకు షాక్ గురిచేసింది. ‘సర్కారు వారి పాట’ టెలివిజన్ ప్రీమియర్లలో కేవలం 9.45 TRP మాత్రమే నమోదు చేసింది. మహేష్ బాబు టెలివిజన్ కెరీర్ లోనే చాలా తక్కువ టీఆర్పీ ఇది. దీంతో సోషల్ మీడియాలో వరుస కామెంట్లు వస్తున్నాయి. సర్కారు వారి పాట – 9.45 టెలివిజన్ ప్రీమియర్‌ల కంటే పుష్ప TRPలు – 9.59 మెరుగ్గా ఉన్నాయని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ మహేష్ బాబు కెరీర్‌లో పేలవమైన ఓపెనింగ్ TRPలలో ఒకటిగా నిలిచింది.