Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంటలపాటు చుక్కలు చూపించిన పోలీసులు!
రాజ్ కుంద్రా సెప్టెంబర్ 15న EOW సమన్ల మేరకు విచారణకు హాజరైనట్లు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, న్యాయమూర్తి గౌతమ్ ఎ అంఖడ్ల ధర్మాసనం దంపతుల పిటిషన్‌పై అక్టోబర్ 8లోగా జవాబు దాఖలు చేయాలని రాష్ట్రం తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంకున్వార్ దేశ్‌ముఖ్‌ను ఆదేశించింది.
- By Gopichand Published Date - 09:13 PM, Tue - 7 October 25

Shilpa Shetty: రూ. 60 కోట్ల రూపాయల మోసం కేసులో నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) వాంగ్మూలాన్ని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) నమోదు చేసింది. దాదాపు 4 గంటల 30 నిమిషాల పాటు శిల్పా శెట్టిని ప్రశ్నించడం, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది అని ముంబై పోలీసు అధికారి తెలిపారు. EOW అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. విచారణ శిల్పా శెట్టి నివాసంలోనే జరిగింది. ఈ విచారణ సమయంలో తన అడ్వర్టైజింగ్ కంపెనీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన లావాదేవీల గురించి శిల్ప పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె పలు పత్రాలను కూడా సమర్పించారు. వీటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.
లుక్అవుట్ సర్క్యులర్ (LOC) సస్పెన్షన్‌కు నిరాకరణ
ముంబై హైకోర్టు బుధవారం శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఎలాంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు విహారయాత్ర కోసం ప్రయాణించడానికి వీలుగా తమపై జారీ చేసిన LOC (లుక్అవుట్ సర్క్యులర్)ను సస్పెండ్ చేయాలని కోరుతూ ఈ దంపతులు కోర్టును ఆశ్రయించారు.
దంపతుల వాదన
దంపతుల తరఫున న్యాయవాదులు నిరంజన్ ముండార్గి, కేరళ మెహతా వాదనలు వినిపిస్తూ.. అక్టోబర్ 2 నుండి 5 వరకు ఫుకెట్‌కు ప్రయాణం కోసం తమ వద్ద ట్రావెల్, స్టే బుకింగ్‌లు ఉన్నాయని తెలిపారు. గత కేసు ఉన్నప్పటికీ తాము ఎల్లప్పుడూ EOWతో సహకరిస్తూ విదేశాలకు వెళ్తున్నామని ఈ జంట పేర్కొంది.
Also Read: PM Modi Wishes Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు!
రూ. 60 కోట్ల మోసం కేసు వివరాలు
ఈ కేసు రూ. 60 కోట్ల రూపాయల మోసానికి సంబంధించినది. ఇందులో రాజ్ కుంద్రా- శిల్పా శెట్టి దంపతులకు చెందిన, ప్రస్తుతం మూసివేయబడిన ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ప్రమేయం ఉంది. UY ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన దీపక్ కోఠారి ఈ కేసును నమోదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో 2015 నుండి 2023 మధ్య కాలంలో రాజ్ కుంద్రా- శిల్పా శెట్టి తమ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి తనను ప్రేరేపించారని, దీంతో తాను రూ. 60,48,98,700 పెట్టుబడి పెట్టానని ఆరోపించారు. ఈ పెట్టుబడికి శిల్పా శెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని కోఠారి పేర్కొన్నారు.
భవిష్యత్తు ప్రయాణాల వివరాలు
రాజ్ కుంద్రా సెప్టెంబర్ 15న EOW సమన్ల మేరకు విచారణకు హాజరైనట్లు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, న్యాయమూర్తి గౌతమ్ ఎ అంఖడ్ల ధర్మాసనం దంపతుల పిటిషన్‌పై అక్టోబర్ 8లోగా జవాబు దాఖలు చేయాలని రాష్ట్రం తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంకున్వార్ దేశ్‌ముఖ్‌ను ఆదేశించింది.
ఈ దంపతులు కోర్టుకు మరో కీలక సమాచారం ఇచ్చారు. అక్టోబర్ 21-24 వరకు లాస్ ఏంజెల్స్, అక్టోబర్ 26-29 వరకు కొలంబో, మాల్దీవులు, డిసెంబర్ 20, 2025 నుండి జనవరి 6, 2026 వరకు దుబాయ్, లండన్‌లకు కూడా తాము ప్రయాణించాల్సి ఉందని తెలిపారు. EOW జవాబును అక్టోబర్ 8 వరకు దాఖలు చేయాలని గడువు ఇచ్చింది. ఆ రోజు కోర్టు మళ్లీ పిటిషన్‌పై విచారణ జరుపుతుంది.