HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sara Ali Khan Gets Emotional

Sara Ali Khan: సారా అలీ ఖాన్ ఎమోషనల్..!

  • Author : Vamsi Chowdary Korata Date : 18-05-2026 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sara Ali Khan Gets Emotional!
Sara Ali Khan Gets Emotional!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పతి పత్ని ఔర్ వో దో’ ఇటీవల మే 15న విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. నేటితరం ప్రేమకథలు, ఆధునిక వైవాహిక బంధాల్లో ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యలను ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించడంతో ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ పెళ్లి బంధంపై తనకునన్న ప్రాక్టికల్ ఆలోచనలను, తన వ్యక్తిగత అభిప్రాయాలను ఎంతో ఓపెన్‌గా పంచుకున్నారు.

తన వ్యక్తిగత జీవితంలో, చుట్టుపక్కల కొన్ని పెళ్లి బంధాలు విఫలమై విడిపోవడాన్ని కళ్లారా చూసిన సారా, వివాహం అనే వ్యవస్థను కేవలం ఊహల్లో చూసి తేలిపోనని స్పష్టం చేశారు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ చూసే సంఘటనల నుంచే మన ఆలోచనలు పుడతాయని పేర్కొంటూ, హడావుడిగా పెళ్లి చేసుకుని బాధపడే కంటే కాస్త సమయం తీసుకుని సరైన వ్యక్తి దొరికే వరకు వేచి చూడటం ఎంతో ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకవేళ తన జీవితంలోకి సరైన భాగస్వామి దొరకకపోతే, ఎవరికోసం తనను తాను మార్చుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమేనని సారా తెగేసి చెప్పారు.

నన్ను ఎవరో వచ్చి సంపూర్ణురాలిగా చేయాల్సిన అవసరం లేదని, ఒక సంపూర్ణమైన మనిషిగా సొంతంగా ఎదగడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని సారా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపును గౌరవిస్తూ, తన సంతోషాన్ని పంచుకునే వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెబుతూ, ప్రస్తుతానికి మాత్రం తన పూర్తి దృష్టి కేవలం కెరీర్, సొంత ఎదుగుదల, సినిమాలపైనే ఉందని ఆమె క్లారిటీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • marriage
  • Relationships
  • sara ali khan
  • Sara Ali Khan- Gill

Related News

Shanmukh Jaswanth gets married quietly.

Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, ఆ తర్వాత బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (షన్నూ) తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. గత కొంతకాలంగా తన లవ్ లైఫ్, పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి ఆర్భా

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd