Sankranthi Vasthunnam : ఓటిటిలోకి వచ్చేందుకు సిద్దమైన ‘సంక్రాంతికి వస్తున్నాం’
Sankranthi Vasthunnam : ప్రస్తుతం థియేటర్స్ లలో ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్ల తో రాణిస్తున్న ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 06:38 PM, Mon - 27 January 25

సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటిటిలోకి వచ్చేసేందుకు సిద్ధమైంది. 2025 సంక్రాంతి (Sankranti ) బరిలో అసలైన బ్లాక్ బస్టర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi Vasthunnam ) మూవీ నిలిచింది. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారని మరోసారి రుజువైంది. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ లో నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కేవలం రెండు వారాల్లో దాదాపు రూ.230 కోట్లు రాబట్టి అసైన్ విక్టరీ అందుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లలో ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్ల తో రాణిస్తున్న ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
Saif Ali Khan : సైఫ్‌పై దాడి కేసులో ట్విస్ట్.. బెంగాలీ మహిళ అరెస్ట్.. ఎవరంటే..
ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ 5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఫిబ్రవరి ప్రథమార్థంలో స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా థియేటర్‌కు జనాలు వస్తుండటంతో ఓటీటీ విడుదల తేదీలో మార్పు చేయమని నిర్మాతలు ఓటీటీ సంస్థను రిక్వెస్ట్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే జీ 5 మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్ చేస్తామని చెప్పడంతో నిర్మాత ‘దిల్’రాజు, ఎలాగైనా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మార్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. మరి Z5 ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు ఖంగారు పడుతున్నారు.