Samyuktha : సంయుక్తకి బాలయ్య ఛాన్స్.. అలా వచ్చిందా..?
Samyuktha సంయుక్త తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. బాలయ్య సినిమా మాత్రం అమ్మడు ఆ యాడ్ చేయడం వల్లే వచ్చిందని అంటున్నారు. ఎలా వచ్చినా సరే లక్కీ ఛాన్స్ వచ్చింది
- By Ramesh Published Date - 11:01 AM, Wed - 29 January 25

Samyuktha : మళయాళ భామ సంయుక్త మీనన్ కు లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ సినిమా ఆఫర్ వచ్చింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న అఖండ 2 లో అమ్మడు నటిస్తుంది. అఖండ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా చేయగా పార్ట్ 2 లో ఆమె బదులుగా సంయుక్త నటిస్తుంది. ఈమధ్యనే అఖండ 2 లో సంయుక్త గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
ఐతే ఈ సినిమాలో సంయుక్తకి ఆఫర్ రావడానికి కారణం ఒక యాడ్ అని తెలుస్తుంది. అదేంటి అంటే బాలయ్యతో కలిసి సంయుక్త ఈమధ్యనే వేగా జెవెలరీ యాడ్ చేసింది. ఆ యాడ్ చూసే ఆమెకు అవకాశం ఇచ్చారట. బాలయ్య పక్కన సంయుక్త జోడీ బాగుందని ఆమెను అఖండ 2 కి అడిగారట. అఖండ సినిమా ఎలాగు పాన్ ఇండియా లెవెల్ లో వైబ్ తెచ్చింది.
భీమ్లా నాయక్ తో ఎంట్రీ..
అందుకే క్రేజీ సీక్వెల్ లో ఛాన్స్ వస్తే ఎలా కాదంటారు చెప్పండి. అందుకే సంయుక్త ఈ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. తెలుగులో భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త విరూపాక్ష, సార్ సినిమాల్లో నటించింది. సెట్స్ మీద ఉన్న నిఖిల్ స్వయంభు సినిమాలో అమ్మడు నటిస్తుంది. ఇప్పుడు అఖండ 2 లో సంయుక్త ఛాన్స్ పట్టేసింది.
ఈ సినిమాలతో సంయుక్త తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. బాలయ్య సినిమా మాత్రం అమ్మడు ఆ యాడ్ చేయడం వల్లే వచ్చిందని అంటున్నారు. ఎలా వచ్చినా సరే లక్కీ ఛాన్స్ వచ్చింది కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం అమ్మడు అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.
Also Read : NTR : పుష్ప 2 ని ఫాలో అవుతున్న దేవర 2..!