NTR : పుష్ప 2 ని ఫాలో అవుతున్న దేవర 2..!
NTR ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉందని ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేవర 1 కమర్షియల్ గా హిట్ అయినా ఎక్కడో ఒకచోట అసంతృప్తి ఉంది. అందుకే దేవర 2 ని కొరటాల శివ నెక్స్ట్ లెవెల్
- By Ramesh Published Date - 10:50 AM, Wed - 29 January 25

NTR : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ స్టామినా చూపించేలా అదరగొట్టేసింది.
ఐతే ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉందని ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేవర 1 కమర్షియల్ గా హిట్ అయినా ఎక్కడో ఒకచోట అసంతృప్తి ఉంది. అందుకే దేవర 2 ని కొరటాల శివ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 2 మాదిరిగా దేవర 2 లో కూడా సర్ ప్రైజ్ లు ఉండేలా చేస్తున్నారట.
ముందు అనుకున్న కథను పూర్తిగా మార్చి..
కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. దేవర 2 ముందు అనుకున్న కథను పూర్తిగా మార్చి సినిమా ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట. దేవర 2 పుష్ప 2 ని ఫాలో అవుతున్నట్టే తెలుస్తుంది. మరి కొరటాల శివ ఏం చేస్తున్నాడన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.
దేవర 2 కి ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం వార్ 2 సినిమాను పూర్తి చేసే పనుల్లో ఉన్న తారక్ ప్రశాంత్ నీల్ తో సినిమాను కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాడు.