Tollywood No.1: సమంత ఔట్.. టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు?
టాలీవుడ్ నటి సమంత టాలీవుడ్ నెం.1 (Tollywood) కుర్చీకి దూరమైందనే చెప్పాలి.
- Author : Balu J
Date : 04-01-2023 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
నటి సమంత (Samantha) కొన్నేళ్లు టాలీవుడ్ టాప్ హీరోయిన్ (Tollywood No.1) గా దూసుకుపోయింది. నాగచైతన్యతో బ్రేకప్ వ్యవవహరం, వ్యక్తిగత ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా సమంత పలు భారీ ప్రాజెక్టులకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో టాప్ హీరోయిన్ పొజిషన్ తో పాటు పలు సినిమా ఆఫర్లను కోల్పోయింది. అయితే పెళ్లయినప్పటి నుంచి టాలీవుడ్ నెం.1 (Tollywood No.1) కుర్చీకి దూరమైందనే చెప్పాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమంత ప్లేస్ ను ఎవరూ రీప్లేస్ చేయలేకపోయారు.
పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లు ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలు చేసినా వరుసగా తెలుగు సినిమాలు లేకపోవడం, చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు లేకపోవడం వల్ల టాప్ హీరోయిన్ పొజిషన్ (Tollywood No.1) కు దూరంగా ఉన్నారు. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి మొదటి సినిమాతో ఆకట్టుకున్నప్పటికీ, ఆ జోరును కొనసాగించడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి, మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్స్ హిట్స్ అందుకున్న మాస్ ఫాలోయింగ్‌కు దూరంగా ఉన్నారు.
పూజా హెగ్డే, రష్మిక నిర్మాతలకు ప్రామిసింగ్ హీరోయిన్స్ అయినప్పటికీ, ప్రస్తుతం కుర్ర హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఇతర హీరోయిన్స్ కంటే దూసుకుపోతోంది. ఇటీవల ధమాకా మూవీతోను ఆకట్టుకుంది. ఇప్పుడిప్పుడే రేసులోకి వస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ శ్రుతి హాసన్ టాప్ ప్లేస్ కు దూరంగానే ఉంది. ఈ నేపథ్యంలో సమంత (Samantha) తన టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంటుందా? కొత్తవారు ఎవరైనా భర్తీ చేస్తారా? అనేది వేచిచూడాల్సిందే.
Also Read: Rashmika and Vijay: ముచ్చటగా మూడోసారి.. విజయ్ తో నటించేందుకు రష్మిక వెయిటింగ్!