ఔను.. వాళ్లిద్దరూ విడిపోతున్నారు..!
ఎస్.. అందరూ అనుకున్నట్టే జరిగింది.. చాలామంది ఊహించేదే నిజమైంది. ఇన్నాళ్లు వచ్చిన వార్తలన్నీ ఏమాత్రం రూమర్స్ కావని తెలిసిపోయింది. ఇదంతా ఎవరి గురించో అనుకుంటున్నారా.. అదేనండీ టాలీవుడ్ జంట అయినా నాగచైతన్య, సమంత గురించే.
- By Balu J Published Date - 04:20 PM, Sat - 2 October 21
![ఔను.. వాళ్లిద్దరూ విడిపోతున్నారు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2021/10/105.jpg)
ఎస్.. అందరూ అనుకున్నట్టే జరిగింది.. చాలామంది ఊహించేదే నిజమైంది. ఇన్నాళ్లు వచ్చిన వార్తలన్నీ ఏమాత్రం రూమర్స్ కావని తెలిసిపోయింది. ఇదంతా ఎవరి గురించో అనుకుంటున్నారా.. అదేనండీ టాలీవుడ్ జంట అయినా నాగచైతన్య, సమంత గురించే. గతకొద్దిరోజులుగా చైసామ్ విడిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఇద్దరూ ఏమాత్రం స్పందించలేదు. మీడియా ముందుకొచ్చినా వ్యక్తిగ విషయాలను పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టం చూపలేదు. లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ లో ఏకంగా నాగచైతన్య వ్యక్తిగత విషయాలు అడగకూడదు అని రూల్స్ కూడా పెట్టారు. ఇక సమంత అయితే తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత.. ‘‘మీరు, చైతన్య విడిపోతున్నారట కదా’’ అన్ని ప్రశ్నించగా.. ‘‘బుద్దుందా’’ అంటూ ఓ జర్నలిస్టుపై సీరియస్ అయ్యింది. ఎక్కడా కూడా వస్తున్న రూమార్స్ కు చెక్ పెట్టలేదు.
తాజాగా నాగాచైతన్య, సమంత ట్విట్టర్ వేదికగా స్పందించారు. అవును మేము విడిపోతున్నాం అంటూ అధికారికంగా వెల్లడించారు. ఎన్నో ఆలోచనలు, సంప్రదింపులు తర్వాత భార్యాభర్తులగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పదేళ్లుగా ఒకరికొకరం స్నేహంగా ఉన్నామని, భార్యాభర్తలుగా విడిపోయినా ప్రత్యేక బంధం ఉంటుందన్నారు. ఈ క్లిష్ట సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు తమకు సపోర్ట్ ఇవ్వాలని కోరారు.
నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయోత్సవాన్ని చైతూ తన ఇంట్లో జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పార్టీలో సమంత కనిపించకపోవడం మరోసారి అనుమానాలకు దారి తీసింది. గత కొద్దిరోజుల నుంచి సమంత నాగచైతన్య పై వస్తున్న వార్తలు రోజురోజుకు అవి నిజమేనని బలాన్ని చేకూర్చాయి.. ఇప్పటివరకు సాయి పల్లవి చైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో పాల్గొనకపోవడం, నాగార్జున పుట్టినరోజు వేడుకలలో పాల్గొనకపోవడం, ఇక తాజాగా డిన్నర్ పార్టీలో కూడా సమంత లేకపోవడంతో వీరి గురించి వస్తున్న వార్తలపై మరిన్ని అనుమానాలు వచ్చాయి.
https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2Fchay_akkineni%2Fstatus%2F1444241025430536194&widget=Tweet
Tags
Related News
![Samantha : సినిమా కోసం సమంత ఏం చేయబోతుంది..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Samantha-Ma-Inti-Bangaram-PAN-India-Release-Plan-1.jpg)
Samantha : సినిమా కోసం సమంత ఏం చేయబోతుంది..?
సిటాడెల్ (Citadel) సీరీస్ షూటింగ్ పూర్తి కాగా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఐతే సమంత నిర్మాణంలో వస్తున్న బంగారం సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. సినిమా లో సమంత డిఫరెంట్ గా