HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Salman Will Be Killed A Threatening Call To The Mumbai Police

Salman Khan Death Threat: సల్మాన్ ను చంపేస్తా.. పోలీసులకు బెదిరింపు కాల్!

'రోకీ భాయ్' అనే వ్యక్తి (Salman Khan)కు కాల్ చేసి, చంపుతానని బెదిరించినట్టు ముంబై (Mumbai) పోలీసులు తెలిపారు.

  • Author : Balu J Date : 11-04-2023 - 12:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salman Khan Rib Injury
Salman Khan Rib Injury

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ‘రోకీ భాయ్’ అనే వ్యక్తి నుండి నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు సోమవారం రాత్రి హత్య బెదిరింపు వచ్చినట్లు ముంబై (Mumbai) పోలీసులు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి ఏప్రిల్ 30 న నటుడిని చంపుతానని బెదిరించాడని,విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. “పోలీస్ కంట్రోల్ రూమ్.. నిన్న రాత్రి అందుకున్న ఓ కాల్‍లో ఓ వ్యక్తి తనను తాను రోకీ భాయ్ అని చెప్పుకున్నాడు. తాను రాజస్థాన్‍లోని జోధ్‍పూర్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పాడు. ఏప్రిల్ 30న నటుడు సల్మాన్ ఖాన్‍ (Salman Khan) ను చంపుతానని బెదిరించాడు. ఈ విషయంపై విచారణ చేస్తున్నాం” అని ముంబై పోలీసులు వెల్లడించారు.

ఇటీవల గ్యాంగ్‍స్టర్ గోల్డీ బ్రార్ నుంచి కూడా సల్మాన్‍ ఖాన్‍ (Salman Khan) కు బెదిరింపులు ఎదురయ్యాయి. గతేడాది పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్న బ్రార్.. సల్మాన్‍ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపు మెయిల్ పంపాడు. ఈ విషయంలో గ్యాంగ్‍స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ బ్రార్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సల్మాన్ ఖాన్ భద్రతా కారణాల రీత్యా హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. సల్మాన్ ఖాన్ కొత్తగా బుల్లెట్ ఫ్రూప్ పెట్రోల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ను కొన్నారు. ఈ కారు ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. నిస్సాన్ కంపెనీ రూపొందించిన ఎస్‌యూవీల్లో అత్యంత ఖరీదైన కారు ఇదేనట. భద్రత కూడా బీ6 లేదా బీ7 ఉంటుందని సమాచారం. బీ6లో 41ఎమ్‌ఎమ్ మందపాటి గ్లాస్, బీ7లో 78ఎమ్‌ఎమ్ మందంతో కూడిన గ్లాస్ ఉంటుంది. ఫలితంగా బుల్లెట్స్ లోపలకు చొరబడలేవు.

Also Read: 40 Dogs Killed: జగిత్యాల జిల్లాలో దారుణం.. 40 కుక్కలు హతం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Death Threat
  • mumbai
  • police case
  • salman khan

Related News

Deaf And Mute Girl

మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

Deaf and Mute Girl : ముంబైలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చగా.. నిందితుడిని గుర్తించేందుకు జరిపిన డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ యువతి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కఫీ పరేడ్ ఏరియాలో ఉండే మూ

  • Usa Cricket Team At A Mumba

    పానీపూరీ కోసం ఎగబడ్డ యూఎస్ఏ ప్లేయర్స్

Latest News

  • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

  • KCR వ్యక్తిత్వంపై సీఎం రేవంత్ విషం చిమ్ముతున్నాడు – కేటీఆర్

  • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

  • హీరో విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్

  • మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.

Trending News

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd