Salman Khan: ఆటో డ్రైవర్ గా మారిపోయిన సల్మాన్ ఖాన్.. నెట్టింట వీడియోస్ వైరల్!
సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఒక మూవీ తో హాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. ఆ మూవీ షూటింగ్ కి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Author : Anshu
Date : 21-02-2025 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సల్మాన్ ఖాన్. అలాగే కమర్షియల్ యాడ్స్ లో చేస్తూనే సినిమాలలో నటిస్తూ బాగానే సంపాదించారు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.
ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ముఖ్య పాత్ర కోసం సల్లూ భాయ్ ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ సైతం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసమే సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే దుబాయ్ పయనం య్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అందులో సల్మాన్ ఖాన్ ఆటో డ్రైవర్ వేషంలో కనిపించారు. ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతడి పక్కనే సంజయ్ దత్ సూటూ బూటు వేసుకుని కనిపించారు.
Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥… #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4
— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ఖాన్ చివరగా టైగర్ 3 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సికందర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది.