Sai Pallavi Bollywood Debut: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సాయి పల్లవి.. స్టార్ హీరో కుమారుడితో మూవీ..?
గతేడాది విరాట పర్వం, గార్గి సినిమాల్లో నటించింది సాయి పల్లవి. పలు తెలుగు చిత్రాలతో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి హిందీ చిత్రసీమలోకి (Sai Pallavi Bollywood Debut) అడుగుపెట్టనుంది.
- Author : Gopichand
Date : 14-09-2023 - 2:12 IST
Published By : Hashtagu Telugu Desk
Sai Pallavi Bollywood Debut: తన అభినయం, డ్యాన్స్‌తో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. గతేడాది విరాట పర్వం, గార్గి సినిమాల్లో నటించింది సాయి పల్లవి. పలు తెలుగు చిత్రాలతో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి హిందీ చిత్రసీమలోకి (Sai Pallavi Bollywood Debut) అడుగుపెట్టనుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సాయి పల్లవి సొంతంగా ఆస్పత్రి ఏర్పాటు చేస్తుందని, సినిమాలకు దూరంగా ఉండనుందని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ మూవీ ప్రేమ కథ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలు ఏమి చేయడం లేదు. ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం భారీ అంచనాలతో రిలీజై పరాజయం పాలైంది. దీంతో సినిమాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Also Read: saiee manjrekar : చీరలో కుందన బొమ్మలా కనిపిస్తున్న సాయి మంజ్రేకర్
సాయి పల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తుందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక జునైద్ ఖాన్‌కు థియేటర్ రంగంలో అనుభవం ఉంది. జునైద్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్‌లో రెండేళ్లపాటు శిక్షణ పొందాడు. అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. మరోవైపు సాయిపల్లవి శివకార్తికేయన్‌తో కలిసి ఓ కొత్త మూవీలో నటిస్తోంది. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఈ మూవీ మాత్రమే ఉంది.